
Teacher Married Student: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ప్రేమ పాఠాలు వల్లించింది. బాలుడిని తన వైపు తిప్పుకుని వారం రోజుల పాటు గడిపింది. ట్యూషన్ కు వచ్చే బాలుడినే తన భర్తగా చేసుకుంది. ఊహించని ఘటనపై విద్యార్థికి కూడా ఏం అర్థం కాలేదు. ఏం అర్థమైందో తెలియలేదు. కానీ చివరకు విషయం తెలియడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. కొడుకు వయసున్న బాలుడిని ఇలా చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సంచలనం సృష్టించిన ఘటనపై పోలీసులు వివరాలు సేకరించడంతో ఆశ్చర్యపోయారు.
పంజాబ్ లో జరిగిన..
పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న సంఘటన అందరిలో విస్మయం కలిగించింది. తన దగ్గరకు ట్యూషన్ కోసం వచ్చే 13 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకుంది. ఏడు రోజుల పాటు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. అన్ని పెళ్లిళ్ల మాదిరిగానే ఈ వివాహాన్ని కూడా పద్ధతి ప్రకారమే జరిపించుకుంది. తల్లిదండ్రుల సాయంతో అన్ని కార్యక్రమాలు చేసింది. మెహందీ ఫంక్షన్, హాల్ది ఫంక్షన్ అంటూ రకరకాల ఈవెంట్లు నిర్వహించుకుంది. పెళ్లి తరువాత మొదటి రాత్రి కూడా జరుపుకుంది.
ఎందుకిలా చేసింది?
టీచర్ కు చాలా రోజులుగా వివాహం కావడం లేదు. ఎవరో పంతులు నీకు కుజ దోషం ఉంది. ఓ బాలుడిని పెళ్లి చేసుకుంటే ఆ దోషం పోతుందని చెప్పాడట. దీంతో ఆమె బాలుడిని లక్ష్యంగా చేసుకుని తన పెళ్లి తంతు ముగించింది. జాతకం ప్రకారం మొదటి భర్త చనిపోతాడని చెప్పడంతో పూజారి సలహా మేరకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బాలుడిని పెళ్లి చేసుకుంది. ముందే అతడి తల్లిదండ్రులకు ఓ వారం పాటు తన దగ్గరే ఉంటాడని ఒప్పందం కుదుర్చుకుంది. చదువులో భాగంగానే అని చెప్పడంతో వారు కూడా ఏం చెప్పలేదు. చివరకు ఇలా చేసింది.
బాలుడి ద్వారా తల్లిదండ్రులకు..
టీచర్ చేసిన నిర్వాకం బాలుడు తన తల్లిదండ్రులకు పూస గుచ్చినట్లు వివరించాడు. దీంతో వారికి ఆగ్రహం కలిగింది. తమ కొడుకును ఇలా చేయడంపై వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్ ను ప్రశ్నించగా ఆమె సమాధానాలు విని ఆందోళనకు గురయ్యారు. మొదటి రాత్రి తరువాత తల్లిదండ్రులు ఆమె గాజులు, పుస్తెమెట్టెలు తీసేసి భర్త చనిపోయినట్లు సంప్రదాయం ప్రకారం అన్ని నిర్వహించారట. దగ్గర బంధువులందరు సంతాప కార్యక్రమాలు నిర్వహించడం కొసమెరుపు.

బలవంతంగా..
పిల్లాడి చేత బలవంతంగా క్షుద్ర పూజలు చేయించారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకుకు ఏదైనా జరిగితే ఎలా ఉండేదని ప్రశ్నిస్తున్నారు. టీచర్ నిర్వాకం ఇప్పుడు అందరిలో సందేహాలు నింపుతోంది. దీనిపై పోలీసులు కూడా తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. ఇదేదో తీసిపారేసే విషయం కాదని లోతుగా అధ్యయనం చేస్తున్నారు. బాలుడిని టార్గెట్ చేసుకుని టీచర్ చేసిన నిర్వాకంతో ఇప్పుడు అందరిలో కొత్త తరహా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ట్యూషన్ కు పంపే వారు ఆందోళన చెందుతున్నారు. బాలుడి విషయంలో టీచర్ చేసిన పన్నాగంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.