Newly Married Women: పెద్దల మాట చద్ది మూట అన్నారు. మన పూర్వీకులు అన్ని అనుభవించాక వారికి అన్ని విషయాలు తెలిసిపోతాయి. జీవిత చివరి మజిలీలో వారు మనకు అనేక సలహాలు, సూచనలు, సందేశాలు ఇస్తుంటారు. కానీ మనం వాటిని పట్టించుకోం. పైగా అసహ్యించుకుంటాం. కసురుకుంటాం కానీ వారుచెప్పింది మాత్రం వినం. దీంతో మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాని పరిస్థితి కలుగుతోంది. ఈ నేపథ్యంలో మన తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు చెప్పే విషయాలను పట్టించుకోవడం లేదు. కానీ మనకు ఆ సమస్య ఎదురైనప్పుడు మాత్రం అయ్యో మా తాత చెప్పినా వినలేదే అని ఆలోచిస్తుంటారు.

ఇటీవల కాలంలో గూగుల్ తల్లిని నమ్ముకుని చాలా మంది తమ పనులు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా పెళ్లయిన వధువులు గూగుల్ లో వెతికే విషయాలు ఏంటని ఆరా తీయగా విస్తుగొలిపే నిజాలు తెలిశాయి. అమ్మాయిలు ఎక్కువగా తన భర్తను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నా మొగుడు నా మాటే వినేలా ఎలా చేసుకోవాలి? అత్తలను ఎలా అదుపులో ఉంచాలి? అనే విషయాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కొత్తగా పెళ్లిళ్లు చేసుకుని సంసారంలోకి అడుగుపెట్టే యువతుల ఆలోచనా సరళి మారుతోంది.
గతంలో అయితే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలు చెప్పిన విషయాలు గుర్తు పెట్టుకునే వారు. అత్తమామలకు ఎదురు తిరగొద్దు. వారు చెప్పినట్లు నడుచుకుని బుద్ధిగా మసలు కోవాలని హితవు పలికేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కాలంలో కూడా తేడా వచ్చింది. అందుకే ప్రతి విషయాన్ని గూగుల్ లో వెతుకుతున్నారు. గూగుల్ తల్లిని నమ్ముకుని సంసారాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకా భవిష్యత్ లో మరిన్ని పరిణామాలో చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇంకా పిల్లలు పుట్టకుండా శృంగారం చేయడం ఎలా? భర్తను సంతృప్తి పరచడం ఎలా? అనే సెర్చ్ చేస్తున్నారు. అత్తమామలను బుట్టలో వేసుకోవడం ఎలా అని వెతుకుతున్నారు. దీంతో పెద్దలు చెప్పే మాటలు లెక్కలోకి రావడం లేదు. యువతలో వచ్చిన మార్పులతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. కొత్త పోకడలతో వింతగా ఆలోచిస్తున్నారని బాధపడాలో తెలియడం లేదు. కట్టుకున్న వాడు తన మాటే వినాలనే ధోరణిలో వారి ప్రవర్తనలో కొత్తదనం కనిపిస్తోంది. అమ్మమ్మల కాలం పోయి గూగుల్ కాలం వచ్చిందని అంటున్నారు.