Waltair Veerayya- Veera Simha Reddy: సంక్రాంతి వచ్చిందంటే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టేస్తాయి..ఈ సంక్రాంతికి కూడా .మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు పోటీ పడుతున్నాయి..చిరంజీవి బాలయ్య సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్నాయి అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వాతారవరణం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు..ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే చాలు ,చిరంజీవి మరియు బాలయ్య సినిమాలు కచ్చితంగా ఉండేవట.

ఆ స్థాయిలో వీళ్లిద్దరి సినిమాలు పోటీ పడుతూ ఉండేవి..కొన్ని సార్లు మెగాస్టార్ చిరంజీవి ఈ పోటీ లో గెలిస్తే, మరికొన్నిసార్లు నందమూరి బాలకృష్ణ గెలిచాడు..చివరిసారిగా వీళ్ళిద్దరూ పోటీ పడింది 2017 వ సంవత్సరం..’ఖైదీ నెంబర్ 150 ‘ తో మెగాస్టార్ చిరంజీవి , ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో నందమూరి బాలకృష్ణ పోటీ పడ్డారు..వీళ్ళిద్దరిలో మెగాస్టార్ చిరంజీవి భారీ మార్జిన్ తో పోటీ లో గెలుపొందాడు..బాలయ్య కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయాడు.
ఈ రెండు సినిమాల కలెక్షన్స్ చూసిన తర్వాత చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్య బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఇంత తేడా ఉంటుందా అని అందరికీ అనిపించింది..చిరంజీవి సినిమా మొదటి రోజు వసూళ్లు బాలయ్య బాబు సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ తో సమానం అని ట్రేడ్ పండితులు సైతం ఏకీభవించారు..అయితే మెగాస్టార్ కి ఇప్పుడు వరుసగా రెండు ఫ్లాప్స్ పడ్డాయి..బాలయ్య అఖండ వంటి సంచలన విజయం తో పాటుగా, ‘అన్ స్టాపబుల్’ షో తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు..దాని ప్రభావం ఆయన లేటెస్ట్ సినిమా మీద కూడా పడింది..రీసెంట్ గానే ‘వీర సింహా రెడ్డి’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభించారు..ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మీద ‘వీర సింహా రెడ్డి’ పై చెయ్యి సాధించింది.

ఈ రెండు సినిమాలలో వీర సింహా రెడ్డి చిత్రానికి 132 షోస్ కి గాను 40 వేల డాలర్స్ రాగా ,’వాల్తేరు వీరయ్య’ చిత్రానికి కేవలం 26 వేల డాలర్లు మాత్రమే వచ్చింది..ఇది చూసి అందరూ షాక్ కి గురైయ్యారు..చిరంజీవి సినిమా మీద బాలయ్య సినిమా పై చెయ్యి సాధించడం ఏమిటి అని అందరూ నోరెళ్లబెట్టారు..అయితే ‘వీరసింహారెడ్డి’ కి అధిక షోస్ ఉన్నాయి కాబట్టే వాల్తేరు వీరయ్య కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయని..కానీ రాబొయ్యే రోజుల్లో ‘వాల్తేరు వీరయ్య’ హవానే ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..చూడాలిమరి ఏమి జరుగుతుందో.