Prices Increase 2023: వచ్చే సంవత్సరం 2023 చేదు ఫలితాలే ఇవ్వనుంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో కుదేలవుతున్న ప్రజలకు కొత్త సంవత్సరం ధరల పెరుగుదల షాక్ ఇవ్వనుంది. దీంతో కొన్ని వస్తువుల ధరలు అమాంతం పెరగనున్నాయి. పెట్రోధరలతో సతమతమవుతున్న వారికి ఈ వార్త మరింత కుంగుబాటుకు గురి చేస్తోంది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ధరాభారం మరోసారి బుసలు కొడుతోంది. దీంతో ఏం చేయాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం తీపి కబురు తెస్తుందనుకుంటే చేదు ఫలితాలతో స్వాగతం పలకనుంది.

జనవరిలో రిఫ్రిజిరేటర్ల ధరలు రెండు శాతం నుంచి ఐదు శాతం పెరుగుతాయని చెబుతున్నారు. సీలింగ్ ఫ్యాన్ల ధరలు కూడా మోత మోగనున్నాయి. ధరల పెరుగుదలకు ముహూర్తం నిర్ణయించారు. కొత్త సంవత్సరం నుంచి పలు రకాల వస్తువుల ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎస్బీఐ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లలో మార్పులు రానున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. బ్యాంకు క్రెడిట్ కార్డు ధరలు కూడా పెరగనున్నాయి. ఈ క్రమంలో కొత్త ఏడాదిలో మనకు మరిన్ని సమస్యలే రానున్నాయి.
జనవరి నుంచి పెరగనున్న వస్తువులు ప్రజలకు ప్రియం కానున్నాయి. పెరిగిన ధరలతో వాటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదని అంటున్నారు. ఇలా తరచుగా ధరలు పెంచుతూ పోతుంటే ఇక వాటిని కొనడం ఎలా అనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ప్రభుత్వం ధరలు పెంచుతుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? వీటిని కొనాలంటే జేబులు గుల్ల కావాల్సిందేనా అనే వాదనలు వస్తున్నాయి. ఎండాకాలంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ఎక్కువ అవుతుంది. ఇందులో భాగంగానే ఫ్యాన్ల ధరలు పెరగడంతో వాటిని ఎలా దక్కించుకోవడం అని ఆలోచిస్తున్నారు.

దీంతో రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతోందో అనే బెంగ అందరిలో పట్టుకుంది. ధరల పెరుగుదలతో ఏ ఇబ్బందులు తలెత్తుతాయో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధరు విపరీతంగా పెరిగితే వాటిని సొంతం చేసుకోవడం కష్టమే. ఇంటికి అవసరమైన వస్తువులు కావడంతో వాటిని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ధరల పెంపుదల సామాన్యులకు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. డబ్బున్న వారికి ఎలాగో సర్దుబాటు అయినా పేదవారి కష్టాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకోవాలని కోరుతున్నారు.