https://oktelugu.com/

K. Vishwanath : చివరి శ్వాస వరకూ.. కే.విశ్వనాథ్ చనిపోవడానికి ముందు ఏం చేశారో తెలుసా!

K. Vishwanath : కళామతల్లి ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న కే. విశ్వనాథ్ చివరి శ్వాస వరకు కళకే అంకితమయ్యారు. విశ్వనాథ్ గారి చివరి క్షణాలు ఎలా గడిచాయనే సమాచారం బయటకు రాగా… ఆయన ఉన్నతిని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. కళ కోసం పుట్టి కళ కోసం బ్రతికి ఆ కళ గురించే ఆలోచిస్తూ… పని చేస్తూ పరమపదించారని తెలుస్తుంది. దర్శకుడిగా కే విశ్వనాథ్ చివరి చిత్రం శుభప్రదం. అల్లరి నరేష్ హీరోగా నటించారు. 2010లో ఆ చిత్రం విడుదల […]

Written By: , Updated On : February 3, 2023 / 09:42 PM IST
Follow us on

K. Vishwanath : కళామతల్లి ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న కే. విశ్వనాథ్ చివరి శ్వాస వరకు కళకే అంకితమయ్యారు. విశ్వనాథ్ గారి చివరి క్షణాలు ఎలా గడిచాయనే సమాచారం బయటకు రాగా… ఆయన ఉన్నతిని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. కళ కోసం పుట్టి కళ కోసం బ్రతికి ఆ కళ గురించే ఆలోచిస్తూ… పని చేస్తూ పరమపదించారని తెలుస్తుంది. దర్శకుడిగా కే విశ్వనాథ్ చివరి చిత్రం శుభప్రదం. అల్లరి నరేష్ హీరోగా నటించారు. 2010లో ఆ చిత్రం విడుదల కాగా విశ్వనాథ్ గారు మళ్ళీ మెగా ఫోన్ పట్టలేదు. అలా అని ఆయన సినిమాకు దూరం కాలేదు. నటుడిగా మారారు.

1995లో విడుదలైన శుభసంకల్పం మూవీలో హీరోయిన్ తండ్రిగా కీలక రోల్ చేశారు. నటుడిగా ఆయనకు మొదటి చిత్రం. కమల్ హాసన్ హీరో కాగా విశ్వనాథ్ దర్శకుడిగా వ్యవహరించారు. డైరెక్షన్ వదిలేసిన విశ్వనాథ్ నటుడిగా బిజీ అయ్యారు. కథలో ప్రాధాన్యత, హుదాతనంతో కూడిన పాత్రలు చేశారు. కలిసుందాం రా, నరసింహనాయుడు వంటి చిత్రాల్లో కే విశ్వనాథ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఇవి రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన చిత్రాలు. యాభైకి పైగా చిత్రాల్లో విశ్వనాథ్ గారు నటించారు. వీటిలో చాలా హిట్స్, సూపర్ హిట్స్ అయ్యాయి.

2022లో విడుదలైన కన్నడ చిత్రంలో చివరిగా కనిపించారు. 90 ఏళ్ళు వచ్చినా విశ్వనాథ్ సినిమాపై కోరిక వదులుకోలేదు. ఆయన చివరి క్షణాలు కూడా కళాత్మకంగా గడిచాయని, తుదిశ్వాస వరకు ఆయన సినిమా గురించే ఆలోచించారని తెలుస్తుంది గురువారం రాత్రి విశ్వనాథ్ గారు ఒక పాట రాస్తున్నారట. ఆ పాటను ఆయన రాయడానికి ఇబ్బందిపడ్డారట. కుమారుడిని పిలిచి మొదలుపెట్టిన పాట పూర్తి చేయమని కోరాడట. పక్కనే కూర్చొని కొడుకు పాట రాస్తుండగా విశ్వనాథ్ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లారట.

వెంటనే అపోలో ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. 20 ఏళ్ల ప్రాయంలోనే విశ్వనాథ్ పరిశ్రమలో అడుగు పెట్టారు. పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 1965లో ఆత్మ గౌరవం సినిమాతో డైరెక్టర్ అయ్యారు. ఏడు దశాబ్దాలు సుదీర్ఘంగా చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు.