Vishwanath’s sons : టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ నిన్న రాత్రి అపోలో హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ తన తుది శ్వాసని విడిచాడు.తెలుగు కళామ్మ తల్లికి విశ్వనాథ్ గారు చేసిన సేవలు ఎనలేనివి..ఆయన తీసినన్ని క్లాసిక్ చిత్రాలు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, మొత్తం ఇండియా వైడ్ ఏ డైరెక్టర్ కూడా తియ్యలేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఆ తరహా సినిమాలు విశ్వనాథ్ మాత్రమే తియ్యగలరు అనే బ్రాండ్ మార్కుని ఏర్పర్చుకున్న మహానుభావుడు ఆయన.
అంతటి దిగ్గజ దర్శకుడి లేజసీ ని ముందుకెలు కొనసాగించేందుకు ఆయన కుటుంబం లో ఎవ్వరు లేరా, ఇండస్ట్రీ లోకి వాళ్ళు ఎందుకు రావాలనుకోలేదు, విశ్వనాథ్ గారి అబ్బాయిగా ఇండస్ట్రీ లోకి వస్తే ఆ పరపతి వేరు కదా..విశ్వనాథ్ గారి అబ్బాయి అంటే ఏ నిర్మాత అయినా సినిమా తియ్యడానికి ముందుకు వస్తారు కదా..కానీ ఎందుకు అసలు ఆ ప్రయత్నాలే చెయ్యలేదు వంటి సందేహాలు అందరిలో ఉండడం సహజమే.
విశ్వనాథ్ గారికి కాశీనాధుని నాగేంద్ర నాథ్ , కాశీనాధుని రవీంద్రనాథ్ అనే ఇద్దరు కొడుకులు మరియు పద్మావతి దేవి అనే కూతురు ఉంది..చిన్నప్పటి ఇద్దరి కొడుకులకు విశ్వనాథ్ గారి లాగానే దేవుడి మీద విపరీతమైన భక్తి ఉండేదట..అమితాసక్తిని మోత దేవుడిపైనే చూపేవారట, అంతే కాదు చదువు లో కూడా వీళ్లిద్దరు అందరికంటే మేటిగా ఉండేవారట,వాళ్ళ అభిరుచులను అన్నీ గమనించిన విశ్వనాథ్ వీళ్ళు పెద్దయ్యాక కచ్చితంగా నాలాగా సినిమాల్లో అయితే రారు అని అనుకునేవాడట.
ఆయన అనుకున్నట్టు గానే ఇద్దరు కుమారులు వ్యాపార రంగం లో బాగా స్థిరపడిపోయారు..ఇవన్నీ విస్వనాథ్ గారు బ్రతికి ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విశేషాలు.ఇక ఈరోజు ఆయన కుమారుడుని అందరూ చూసారు, ఇంటికి తన తండ్రి గారి పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిన ప్రతీ ఒక్కరినీ పలకరించాడు..ఆయనకీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ప్రస్తుతం వైరల్ గా మారాయి.