Healthy Memory Tips: ఇటీవల కాలంలో మనిషి ఆహార అలవాట్లు మారుతున్నాయి. యాంత్రిక జీవితంలో ఎన్నో కోల్పోతున్నాం. సరైన ఆహారాలు తీసుకోకపోడంతో మతిమరుపు కూడా ఓ సమస్యగా మారుతోంది. పెరుగుతున్న వయసు కారణంగా కూడా అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. దీనికి సరైన నిద్ర లేకపోవడం కూడా ఒక కారణమే అంటున్నారు వైద్యులు. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మతిమరుపు సమస్య రాకుండా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో జ్ణాపకశక్తి తగ్గిపోతోంది. ఫలితంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ (ఈఎఫ్ఏ) ను మన శరీరం దానంతట అదే ఉత్పత్తి చేయదు మనం తినే ఆహారాల ద్వారా పొందాలి. మెదడు ఆరోగ్యంగా ఉంటే మెమోరీ పవర్ ను పెంచే అత్యంత ప్రభావం కలిగిన ఒమేగా 3 కొవ్వులు ఉండటంతో మన ఆరోగ్యం బాగుంటుంది. చేపలతో మనకు ఎన్నో లాభాలున్నాయి. బ్లూ బెర్రీల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి మెదడు బాగా పనిచేయడానికి సహకరిస్తాయి. ఏకాగ్రత దెబ్బతినకుండా చేస్తాయి.

గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉండటంతో జ్ణాపకశక్తి, ఆలోచన సామర్థ్యం పెంచుతాయి. గుమ్మడి గింజల్లో ఒత్తిడిని తగ్గించే మెగ్నిషియం, బి విటమిన్లు, ట్రిప్టోసాన్ ఉండటం వల్ల మానసిక స్థితి బాగుంటుంది. గుడ్లలో ఉండే కొలిన్ వల్ల కూడా జ్ణాపకశక్తిని పెంచుతాయి. ఇంులో ఉండే విటమిన్ బి1, విటమిన్ బి3, కోలిన్ తో సహా పలు పోషకాలు లభించడంతో గుడ్డు కూడా ప్రొటీన్ ఉన్న ఆహారమే. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. జ్ణాపకశక్తిని పెంచే ఎసిటైల్కోలిన్ అనే రసాయనంతో మనకు ఎన్నో లాభాలున్నాయి.