Governor Tamilisai- KCR: జాతీయ రాజకీయాలంటూ.. పార్టీని దేశవ్యాప్తం చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టిపెట్టారు. ఈ సమయంలో యావత్ దేశం దృష్టిని తెలంగాణవైపు తిప్పుకునేలా గవర్నర్ తమిళిసై తనకు కలిసి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణను రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం, తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనపై ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జాతీయ మీడియాకు లాగారు. జాతీయ మీడియా సాక్షిగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ ఉలంఘన గురించి మాట్లాడారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనపై జాతీయస్థాయిలో చర్చ జరిగేలా తమిళిసై ప్రయత్నించారు.

*-కేసీఆర్ టార్గెట్‌గానే విమర్శలు..*
తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ టార్గెట్‌గానే విరమ్శలు చేసిన గవర్నర్ తమిళిసై తాజాగా జాతీయ మీడియాలోనూ కేసీఆర్ లక్ష్యంగానే తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తున్న తీరును ఎండగట్టారు. మూడేళ్లుగా తనతో అధికార పార్టీ ప్రతినిధలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌కు చేసిందని పేర్కొన్నారు. తాను పరేడ్ గ్రౌండ్‌లో వేడుకల్లో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా కోవిడ్ –19 ఆంక్షలను సాకుగా చూపిందని తెలిపారు. తనకు కాకపోయినా గవర్నర్ పదవికి కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని వివరించారు. 5 లక్షల మందితో ఖమ్మంలో ప్రభుత్వం సభ నిర్వహించుకుంటే రాని కరోనా పరేడ్ గ్రౌండ్‌లో 5 వేల మందితో వస్తుందని పేర్కొనడంలో తెలంగాణ ప్రభుత్వం దురుద్దేశం, కావాలనే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన తీరును అర్థం చేసుకోవాలన్నారు.
-*డిబేట్‌లో బీఆర్‌ఎస్ నేత నోరు మూయించిన గవర్నర్*
జాతీయ మీడియా నిర్వహించిన ఈ డిబేట్‌లో బీఆర్‌ఎస్‌నేత రావుల శ్రీధర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడాన్ని ఈ సందర్భంగా ఆయన డిబేట్‌లో ప్రస్తావించారు. తమిళిసైపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. దీనిపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిల్లుల గురించి తరువాత మాట్లాడుకోవచ్చు, మొదట ప్రొటోకాల్ గురించి మాట్లాడండి’ అని శ్రీధర్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

రాజ్యాంగ పదవిలో ఉన్న తనను బీజేపీ ఏజెంట్‌గా చిత్రీకరించేందుకు బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఈ సందర్భంగా ఆమె ఎండట్టారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఇష్యూ కేంద్రానికి గవర్నర్ నివేదిక ఇవ్వడం ద్వారా జాతీయ ఇష్యూగా మారింది. ఇదే క్రమంలో గవర్నర్ జాతీయ మీడియా డిబేట్‌లో పాల్గొని ఈ అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చేశారు. దీంతో రిపబ్లిక్‌డే అంశంపై గవర్నర్ తమిళిసై కూల్ అయిపోయినట్లు కనిపిస్తున్నారు. కానీ, గవర్నర్‌పై బీఆర్‌ఎస్ నేతలు శాంతించడం లేదు. రానున్న రోజుల్లో ఈ అంశం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.