Fat Loss: ఆధునిక జీవన విధానంలో కొవ్వు పెరుగుతోంది. ఫలితంగా బరువు ఎక్కువవుతోంది. అధిక బరువుతో అనర్థాలు వస్తున్నాయి. మగాళ్లకైతే పొట్ట, ఆడాళ్లకైతే పిరుదుల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నాం. దీంతో మధుమేహం, గుండెపోటు వంటి వాటి బారిన పడుతున్నాం. దీర్ఘ కాలిక వ్యాధులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. వాకింగ్ చేస్తూ ఉంటే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నాజూకైన శరీరం మన సొంతం అవడం ఖాయం.

రోజు ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం రాకుండా నిరోధిస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఈ నేపథ్యంలో గోరు వెచ్చని నీటిని తీసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరం. ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఇంకా యోగాసనాలు వేస్తే కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరిచే విధంగా ఇవి సాయపడతాయి. వేయించిన మెంతుల పొడిని సిద్ధంగా ఉంచుకుని ఆహారంలో కలుపుకుని తింటే ఎంతో మంచిది.
అల్లం పొడిని గోరు వెచ్చని నీటిలో వేసుకుని కలుపుని తాగితే కొవ్వు కరిగేందుకు దోహదపడుతుంది. రాత్రి పూట భోజనాన్ని ఏడు గంటల లోపు ముగించాలి. అది కూడా తక్కువ కేలరీలు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేడ్లు తక్కువగా అందుతాయి. త్రిఫల చూర్ణం కూడా శరీరంలోని విష పదార్థాలు దూరమయ్యేలా చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడేందుకు సాయడుతుంది. ఒక స్పూన్ త్రిఫల చూర్ణం గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

ప్రతి రోజు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల కూడా మన శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. సాధ్యమైనంత వరకు స్వీట్లు తగ్గించాలి. కొవ్వును తగ్గించుకోవడానికి గార్శినియా, కంబోరియా కాయలు తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గించడంలో ఇది సాయపడుతుంది. ఇలా మనం అధిక బరువు నుంచి బాధపడుతుంటే ఈ చిట్కాలు పాటించి బరువును నియంత్రణలో ఉంచుకుని కొవ్వును తగ్గించుకునే మార్గాలను అన్వేషించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.