Advocate- Lawyer: అడ్వకేట్‌.. లాయర్‌ రెండే వేరా.. ఇద్దరూ ఒకటే అయితే రెండు పదాలు ఎందుకు..?

లాయర్‌ అడ్వకేట్‌ ఇద్దరూ ఒకటే కాదు.. ఇద్దరు ఒకటే అయితే రెండు పదాలు ఎందుకు వాడతారన్న సందేహం చాలా మందిలో ఉంది. మరి రెండు పదాలు ఎందుకు వాడతారు.. ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది చూద్దాం..

Written By: Raj Shekar, Updated On : September 17, 2023 1:48 pm

Advocate- Lawyer

Follow us on

Advocate- Lawyer: లాయర్‌.. పేరు చెప్పగానే.. నల్లకోటు.. కోర్టు.. వాదనలు గుర్తొస్తాయి. ఇది చదువుకున్నవారితోపాటు చదువు రాని వారికి కూడా తెలుసు. కొంతమంది వకీల్‌ అని కూడా అంటుంటారు. మరి అడ్వకేట్‌ అనే పదం కూడా వాడుతుంటారు. ఈ పదం చదువుకున్నవారే ఎక్కువగా వడుతుంటారు. దీని అర్థం కూడా లాయర్‌గానే భావిస్తారు చాలా మంది. అడ్వకేట్, లాయర్‌ ఒకరే అనుకుంటారు. అయితే మరి నిజంగా లాయర్‌ అడ్వకేట్‌ ఒకరేనా..? లేదంటే లాయర్‌ కి అడ్వకేట్‌ కి ఏమైనా తేడా ఉందా..? ఇద్దరు ఒకరే అనుకుని చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరు వేరు. అయితే మరి అసలు అడ్వకేట్‌ అంటే ఎవరు..?, లాయర్‌ అంటే ఎవరు..? వారి మధ్య తేడా ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

లాయర్‌.. అడ్వకేట్‌ వేర్వేరు..
లాయర్‌ అడ్వకేట్‌ ఇద్దరూ ఒకటే కాదు.. ఇద్దరు ఒకటే అయితే రెండు పదాలు ఎందుకు వాడతారన్న సందేహం చాలా మందిలో ఉంది. మరి రెండు పదాలు ఎందుకు వాడతారు.. ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది చూద్దాం..
లాయర్‌..
లాయర్, అడ్వకేట్‌ ఇద్దరూ న్యాయ విద్య చదివినవారే.. అయితే లయర్స్‌ న్యాయపరమైన సలహాలను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్లు కేవలం లా కోసం చెబుతారు. కానీ కోర్ట్‌లో క్లయింట్‌ కోసం వాదించడం కుదరదు. అదే అడ్వకేట్‌ అయితే క్లయింట్‌ కోసం వాదించచ్చు. అలానే అడ్వకేట్‌కు అనుభవం ఎక్కువ. అడ్వకేట్‌ కి ఎక్కువ డబ్బులిస్తారు. లాయర్‌ ఫీజ్‌ తక్కువగా ఉంటుంది.

ఇద్దరూ లా చదివాల్సిందే..
అడ్వకేట్‌.. లాయర్‌ ఎవరైనా సరే ‘లా’ చదివేసి.. తర్వాత బ్యాచిలర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ లా డిగ్రీని పొందితే వాళ్లని లాయర్‌ అనాలి. అలాగే స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌లో ఇండియాలో ఎవరైనా లాయర్‌ దగ్గర కానీ లా గ్రాడ్యుయేట్‌ కోర్ట్‌లో ప్రాక్టీస్‌ కోసం ఎన్రోల్‌ చేసుకోవాలి. ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌ పూర్తిచేసి ఉండాలి. వాళ్లు తర్వాత అడ్వకేట్‌ దగ్గర ప్రాక్టీస్‌ చేస్తారు. ఇక అడ్వకేట్‌ ఎవరంటే ఎవరైతే ఎల్‌ఎల్‌బీ డిగ్రీని పొంది.. బార్‌ ఎగ్జామినేషన్‌ పూర్తి చేస్తారో వాళ్లని అడ్వకేట్‌ అంటారు.

బారిస్టర్‌ కూడా..
లాయర్, అడ్వకేట్‌ పదాలతోపాటు బారిసర్టర్‌ పదం కూడా గతంలో వాడుకలో ఉండేది. బారిస్ట్టర్‌ అంటే ఏమిటనేది చూస్తే.. చాలా మంది విదేశాలకి వెళ్లి చదువుతారు. ఇంగండ్‌లో కానీ స్కాట్‌ల్యాండ్‌ లేదా సౌత్‌ ఆఫ్రికాలో లా చదివి వచ్చారంటే వాళ్లని బారిష్టర్‌ అంటారు. బారిస్టర్‌ కూడా అడ్వకేట్‌ లానే. స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో న్యాయ విద్య కళాశాలలు ఉండేవి కావుద. దీంతో చాలా మంది విదేశాలకు వెళ్లి చదివేవారు. స్వాతంత్ర సమరయోధులైన నెహ్రూ, అంబేద్కర్‌తోపాటు చాలా మంది బారిస్టర్‌ పూర్తి చేశారు.