Niharika Konidela
Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఫీల్డులోకి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్ నిహారిక. టవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత కొన్ని సినిమాల్లో అలరించారు. ఆ తరువాత నిర్మాతగా కొనసాగుతున్నారు. నిహారిక్ చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకొని ఆ తరువాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకులు తీసుకున్న తరువాత ఈమె ఫ్రీ బర్డ్ అయిపోయింది. స్వేచ్ఛగా విహరిస్తోంది. అందచందాలను ఆరబోస్తూ యూత్ ను ఇంప్రెస్ చేస్తోంది. కొన్ని రోజుల కిందట ఆమె గ్లామర్ ఫోటోలు నెట్టింట్లో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. తాజాగా ఆఫ్రికాలోని హాట్ గా కనిపిస్తున్న కొన్ని పిక్స్ మితపోగొట్టేస్తున్నాయి.
నిహారిక కొణిదెల 1993 డిసెంబర్ 18న హైదరాబాద్ లో జన్మించారు. చదువు పూర్తి చేసుకున్న తరువాత టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. మొదట్లో డీ జూనియర్ 1 , డీ జూనియర్ 2 షోలకు హోస్ట్ గా చేశారు. ఆ తరువాత ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఇది యూట్యూబ్ లో రిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో నిహారికకు ఫ్యాన్స్ పెరిగారు. దీంతో 2015లో ‘ఒక మనసు’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా నటించింది. 2019లో ‘సూర్యకాంతం’లో మరోసారి నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఓ పాత్ర పోషించింది.
కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే నిహారిక 2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఉదయ విలాస్ లో అంగరంగ వైభంగా సాగింది. కొన్నాళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఆ తరువాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఈ జంట 2023 జూలై 5న విడాకులు తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి నిహారిక ఫ్రీ బర్డ్ లాగా స్వేచ్ఛగా విహరిస్తోంది. గ్లామర్ డోస్ పెంచి ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది.
లేటేస్టుగా నిహారిక ఫ్యామిలీ వెకేషన్ కోసం ఆఫ్రికా టూర్ కు వెళ్లింది. ఈ సందర్భంగా నిహారిక విచ్చలవిడిగా ఫొటోలు దిగింది. అందచందాలను ఆరబోసి గౌనులో దర్శనమిస్తుంది. ఈ ఫొటోలను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఆమెు వేసుకున్న టాటూపై చర్చలు పెడుతున్నారు.