Ghaziabad GYM: ఆరోగ్యానికి వ్యాయామం అవసరం. కానీ ఎక్కువ గా చేస్తే ప్రమాదమే అని.. వరుస సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఫిట్ గా ఉండేందుకు చాలా మంది ప్రతిరోజూ వర్కౌట్లు చేస్తుంటారు. ఇందు కోసం జిమ్ సెంటర్లకు వెళ్తున్నారు. అయితే ఇవి ఆరోగ్యాన్ని ఇచ్చే సెంటర్లకు బదులు మరణాలకు వేదికలుగా మారుతున్నాయి. ప్రముఖ హీరో పునీత్ రాజ్ కుమార్ నుంచి చాలా మంది ప్రముఖులు వర్కౌట్లు చేస్తూ చనిపోయారు. తాజాగా ఓ యువకుడు జిమ్ సెంటర్లోని ట్రేడ్ మిల్ పై నడుస్తూ కుప్పకూలాడు. ఆ యువకుడు జిమ్ సెంటర్ లోనే కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో జరిగిన ఈ వీడియోను చూసి చాలా మంది వర్కౌట్ చేసేవారు ఆందోళన చెందుతున్నారు.
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ రోజువారీ వ్యాయామం లో భాగంగా ఇంట్లోనే వర్కౌట్ చేశారు. ఈ క్రమంలో అతనికి గుండెపోటు వచ్చింది. ఆ తరువాత ఆసుపత్రికి పోయేలోపు మరణించాడు. ఆ తరువాత హస్యనటుడు రాజు శ్రీ వాత్సవ ట్రేడ్ మిల్ నడుస్తూ హార్ట్ ఎటాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రముఖ టీవీ స్టార్ సిద్ధార్థ శుక్లా కూడా ముంబైలోని జిమ్ లో వర్కౌట్ చేస్తూ గుండెపోటుకు గురై ఆ తరువాత ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతూ మరణించారు. చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా ఇలా వర్కౌట్లు చేస్తూ గుండె పోటుకు గురవుతున్నారు.
తాజాగా ఢిల్లీలోని ఘజియాబాద్ లో ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి విహార్ లో ఉన్న ఓ జిమ్ సెంటర్ కు సిద్ధార్థ్ అనే వ్యక్తి వెళ్లాడు. రోజూవారి వ్యాయామంలో భాగంగా ట్రేడ్ మిల్ పై నడిచాడు. వాకింగ్ వ్యాయామాన్ని తలపించేలా ఉండే ఈ పరికరంపై నడుస్తూ అలాగే అతను కుప్పకూలాడు. అయతే ఆ యువకుడు శనివారం రాత్రి 11.55 గంటలకు ట్రేడ్ మిల్ పై నడిచినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ సమయంలో అతడు నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. దీంతో అక్కడున్న జిమ్ సిబ్బంది అతనిని పైకి లేపేందుకు ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి బీహార్ కు చెందినవాడు. దీంతో అతని మృతదేహాన్ని సొంత గ్రామానికి పంపించారు.
అయితే జిమ్ సెంటర్ లోకి వెళ్లే ముందు ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? అని గుర్తించిన తరువాతే వెళ్లాలని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. కొందరు యువకులు ఫిట్ నెస్ కోసం ఎక్కువగా జిమ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల గుండెకు ప్రమాదమేనన్నారు. ఆరోగ్యం కోసం అవసరమైనంత వరకే వ్యాయామం చేయాలని, ఇప్పటికే గుండెపోటుకు గురైన వారు జిమ్ సెంటర్లకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.
Yesterday I posted this video in which a 19 year old boy unfortunately died of heart attack in the Gym..
Dr. Tiwari @DrManishTiwari ji shared this video in which we can learn how we can save the patient in such a situation…
Please do watch… https://t.co/SDzapM9KLA https://t.co/SPbNkuasd3— Ravi Pratap Dubey (@ravipratapdubey) September 17, 2023