https://oktelugu.com/

Indian Railways: ట్రైన్ లో ఈ టికెట్ తో 56 రోజులు ప్రయాణించవచ్చు.. ఎలాగో తెలుసా?

సర్క్యులర్ టికెట్ తీసుకోవాలనుకునేవారు సరైన సమయానికి తీసుకోవాలంటే కుదరదు. ఒకరోజు ముందు దగ్గర్లోని స్టేషన్ మేనేజర్ ను సంప్రదించాలి. మీ ప్రయాణ వివరాలు తెలపాలి. మీరు ప్రయాణించే ప్రదేశాలను భట్టి టికెట్ ధరను నిర్ణయిస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 4, 2023 / 08:19 AM IST

    Indian Railways

    Follow us on

    Indian Railways: భారతీయ రైల్వే వ్యవస్థ మిగతా రవాణాల కంటే పెద్దది. ప్రతిరోజు రైళ్లలో లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. సూదూర ప్రాంతాలకు తక్కువ దూరంలో తీసుకెళ్లే ఏకైక సాధనం రైలు మాత్రమే. అందుకే పేద వారినుంచి డబ్బున్న వారు సైతం ట్రైన్ జర్నీకి ఇష్డపడుతారు. ఇప్పడు అందరినీ ఆకర్షించే విధంగా బుల్లెట్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే కౌంటర్ లో టికెట్ తీసుకోవాలి. లేదా రిజర్వేషన్ చేయించుకోవాలి. కానీ ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ముందే నిర్ణయించుకొని ప్రతీసారి, స్టేషన్ టు స్టేషన్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే పలు స్టేషన్లలో దిగాల్సి.. మళ్లీ ఎక్కాల్సి వచ్చినప్పుడు ఇలా టికెట్ తీసుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో రైల్వే వ్యవస్థలో ఓ సదుపాయాన్ని అందుబాటులో ఉంచారు. అదే సర్క్యూలర్ టికెట్. మరి దీని గురించి తెలుసుకుందామా.

    చాలా ప్రాంతాల్లో దిగాల్సి.. మళ్లీ ట్రైన్ ఎక్కాల్సి వచ్చినప్పుడు సర్య్యూలర్ టికెట్ బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు జర్నీ చేసేవారు మధ్యలో దిగాల్సి ఉన్నవారు, లేదా విహార యాత్రలకు వెళ్లే వారు పలు ప్రాంతాల వారు ఈ టికెట్ తీసుకోవాలి. ఇది ఒక్కసారి తీసుకుంటే 56 రోజుల పాటు చెల్లుతుంది. దీనిని వ్యక్తిగతంగా లేదా సమూహంగా ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక సారి టికెట్ తీసుకొని 8 స్టేషన్లు, స్టాపేజ్ పాయింట్లలో దిగవచ్చు. అయతే ప్రారంభ, ముగింపు స్టేషన్లు ఒకే విధంగా ఉండేలా ప్లాన్ చేసుకోవలి. విడివిడిగా టికెట్ బుక్ చేసుకున్న దానికంటే సర్క్యూలర్ టికెట్ ధర తక్కువగా ఉండడం వల్ల చాలా మంది దీనిపై దృష్టి పెడుతారు.

    సర్క్యులర్ టికెట్ తీసుకోవాలనుకునేవారు సరైన సమయానికి తీసుకోవాలంటే కుదరదు. ఒకరోజు ముందు దగ్గర్లోని స్టేషన్ మేనేజర్ ను సంప్రదించాలి. మీ ప్రయాణ వివరాలు తెలపాలి. మీరు ప్రయాణించే ప్రదేశాలను భట్టి టికెట్ ధరను నిర్ణయిస్తారు. ఇందులో డివిజనల్, డివిజనల్ కమర్షియల్ ప్రయాణాల ఆధారంగా ప్రణాళికలు వేసుకొని టికెట్ తీసుకోవచ్చు. ప్రయాణం ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్న స్టేషన్ బుకింగ్ కార్యాలయంలో ఓ ఫారం నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకున్న తరువాత మీకు సర్క్యులర్ టికెట్ ఇస్తారు.

    కనిష్టంగా 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటప్పుడు సర్క్యులర్ జర్నీ టిక్కెట్ల ధరపై సీనియర్ సిటీజన్లయిన పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం రాయితీ ఇస్తారు. ఈ టికెట్ ప్రయాణ రోజుల మీటర్ల దూరానికి 1 రోజు లేదా దానిని భాగిస్తారు. ప్రయాణికుడు ప్రయాణం ప్రారంభించేటప్పుడు టికెట్ పై తేదీతో సంతకం చేయాల్సి ఉంటుంది.