https://oktelugu.com/

Bigg Boss Telugu Season 7: బిగ్ బాస్ 7 లో కేవలం 14 మందే … కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!

ఏడో కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్. ఈయన కూడా సుపరిచితుడే. ఎనిమిదో కంటెస్టెంట్ గా కార్తీకదీపం ఫేమ్ శోభిత శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఈమె పేరు మొదటి నుండి వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Written By:
  • Shiva
  • , Updated On : September 4, 2023 / 08:26 AM IST

    Bigg Boss Telugu Season 7

    Follow us on

    Bigg Boss Telugu Season 7: బిగ్ బాస్ తెలుగు 7 ఆదివారం రాత్రి ఘనంగా మొదలైంది. నాగార్జున సారథ్యంలో అట్టహాసంగా నడిచింది. ఒక్కొక్కరిగా ఈ సీజన్ కంటెస్టెంట్స్ ని పరిచయం చేశారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి ప్రియాంక సింగ్ హౌస్లో అడుగుపెట్టింది. జానకి కలగనలేదు సీరియల్ లో లీడ్ యాక్ట్రెస్ గా ఈమె చేశారు. ఇక రెండో కంటెస్టెంట్ గా నటుడు శివాజీ ఎంట్రీ ఇచ్చాడు. మనకు వలె నాగార్జున కూడా శివాజీ హౌస్ కి రావడంతో ఆశ్చర్యపోయాడు. అసలు నువ్వు బిగ్ బాస్ కి వస్తావనుకోలేదు అన్నాడు.

    ఇక మూడో కంటెస్టెంట్ గా సింగర్ దామిని ఎంట్రీ ఇచ్చింది. ఆమె నాగార్జున ఓ గిఫ్ట్ ఇవ్వడం విశేషం. నాలుగో కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్. ఇతడు మోడల్, నటుడు. ఇక ఐదో కంటెస్టెంట్ గా నటి శుభశ్రీ రాయగురు ఎంట్రీ ఇచ్చింది. ఈమె వృత్తి రీత్యా లాయర్, నటి కూడా రాణిస్తుంది. తర్వాత ఆరో కంటెస్టెంట్ గా సీనియర్ నటి షకీలా ఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో బాగా తెలిసిన పేరు అని చెప్పొచ్చు.

    ఇక ఏడో కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్. ఈయన కూడా సుపరిచితుడే. ఎనిమిదో కంటెస్టెంట్ గా కార్తీకదీపం ఫేమ్ శోభిత శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఈమె పేరు మొదటి నుండి వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక తొమ్మిదో కంటెస్టెంట్ గా యూట్యూబర్ టేస్టీ తేజా వచ్చాడు. పదో కంటెస్టెంట్ గా హీరోయిన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రతిక వచ్చింది. పదకొండో కంటెస్టెంట్ గా నటుడు గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడు డాక్టర్ కూడాను.

    పన్నెండో కంటెస్టెంట్ గా నటి కిరణ్ రాథోడ్ హౌస్లో అడుగుపెట్టింది. ఒకప్పుడు ఈమె పాపులర్ యాక్ట్రెస్. ఇక పదమూడో కంటెస్టెంట్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. సామాన్యుడు కోటాలో అవకాశం దక్కింది. ఇక చివరి కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి ఎంట్రీ ఇచ్చాడు. కనీసం 19 నుండి 20 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. కేవలం 14 మందిని తీసుకోవడం వెనుక ఆంతర్యం అర్థం కాలేదు.