https://oktelugu.com/

పూరి జగన్నాథ్ బెస్ట్ ఇయర్ 2020నేనట తెలుసా?

విలక్షణ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో చెప్పే స్ఫూర్తిదాయక మాటలు కరోనా లాక్ డౌన్ వేళ అందరికీ భరోసానిచ్చాయి. ఆయన మాటల ప్రవాహాన్ని అందరూ ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఫాలో అయ్యారు. కరోనా లాక్ డౌన్ తో ఇంట్లో ఖాళీగా ఉన్న పూరి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే వాస్తవాలను హితబోధ చేశాడు. Also Read: ట్రైలర్ టాక్: ‘క్రాక్’ పుట్టించిన రవితేజ తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా పూరి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 1, 2021 / 12:11 PM IST
    Follow us on

    puri-jagannath-

    విలక్షణ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో చెప్పే స్ఫూర్తిదాయక మాటలు కరోనా లాక్ డౌన్ వేళ అందరికీ భరోసానిచ్చాయి. ఆయన మాటల ప్రవాహాన్ని అందరూ ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఫాలో అయ్యారు. కరోనా లాక్ డౌన్ తో ఇంట్లో ఖాళీగా ఉన్న పూరి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే వాస్తవాలను హితబోధ చేశాడు.

    Also Read: ట్రైలర్ టాక్: ‘క్రాక్’ పుట్టించిన రవితేజ

    తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా పూరి జగ్నాథ్ తన మనోభావాలను మరోసారి వెల్లడించాడు. 2020 సంవత్సరం మన జీవితంలోనే బెస్ట్ సంవత్సరం అంటూ పేర్కొన్నాడు. ఈ సంవత్సరం అందరికీ ఎన్నో నేర్పించదన్నాడు. 2020 సంవత్సరం లైఫ్‌లో సేవింగ్స్‌ ఎంత అవసరమో తెలిసివచ్చిందని పూరి జగన్నాథ్ విశ్లేషించారు. అనవసరమైన షాపింగ్‌లు, చిరుతిళ్లు తగ్గాయ్‌. నేచర్‌ చాలా పవర్‌ఫుల్‌ అని తెలిసింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నేర్చుకున్నాం. ఆడవాళ్లు.. బంగారం, కొత్తచీరలు లేకుండా బతకడం నేర్చుకున్నారు. అవసరమైనవి మాత్రమే కొంటున్నాం. డబ్బు ఉన్నా, లేకపోయినా.. ఎలా బతికామో.. మనకే తెలియదు. నిజమైన స్నేహితులెవరో ఇప్పుడే తెలిసింది. ఏ దేవుడూ మనల్ని కాపాడలేడని తెలిసింది..” అంటూ 2020 సంవత్సరం చాలా గుణపాఠం నేర్పిందని పూరి చెప్పుకొచ్చాడు.

    ఇక 2020 సంవత్సరం మనుషులకు ఖచ్చితంగా పరిశుభ్రత నేర్పిందని పూరి జగన్నాథ్ వివరించాడు. వైరస్‌, న్యూట్రేషన్‌, శానిటైజర్‌‌, క్వారంటైన్‌, యాంటీ బాడీస్‌, ప్లాస్మా, స్ట్రెయిన్‌ ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయని పూరి వివరించాడు. పుట్టిన తర్వాత మనం ఇన్ని సార్లు ఎప్పుడూ హ్యాండ్ వాష్ చేసుకోలేదని.. పల్లెటూళ్లలో చదువుకొని వారికి కూడా చాలా విషయాలు తెలిశాయన్నారు. మొదట్లో నెలరోజులు లాక్‌డౌన్‌ అంటే మనకి పిచ్చి లేచింది. ఖాళీగా ఇంటిలో కూర్చోవాలంటే.. మెంటల్‌ హెల్త్‌ చాలా అవసరం అని తెలుసుకున్నాం. మనలో ఓర్పు బాగా పెరిగిందని వివరించారు.

    Also Read: మెగాస్టార్ నుండి ఎమోషనల్ విషెస్ !

    ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో అందరికీ అర్థమైందని తెలిపారు.మనిషికి ఇమ్యూనిటీ ఎంత అవసరమో తెలిసిందన్నారు. మంచి ఆహారం యొక్క విలువ తెలిసిందని వివరించారు. అందరూ తిట్టుకుంటున్న 2020 సంవత్సరం మన జీవితంలోనే బెస్ట్ ఇయర్ అంటున్నాడు పూరి జగన్నాథ్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్