https://oktelugu.com/

ట్రైలర్ టాక్: ‘క్రాక్’ పుట్టించిన రవితేజ

విజయాల కోసం టాలీవుడ్ లో చకోరా పక్షిలా విహరిస్తున్న మాస్ మహారాజ రవితేజ. ఒక హిట్టు.. తర్వాత మూడు నాలుగు సినిమాలు ఫట్టు అన్నట్టుగా ఆయన టాలీవుడ్ ప్రయాణం సాగుతోంది. అయినా అలుపెరగకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. Also Read: మెగాస్టార్ నుండి ఎమోషనల్ విషెస్ ! తాజాగా ఈ సంక్రాంతి రేసులోకి రవితేజ వచ్చాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ వలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల […]

Written By:
  • NARESH
  • , Updated On : January 1, 2021 / 12:03 PM IST
    Follow us on

    విజయాల కోసం టాలీవుడ్ లో చకోరా పక్షిలా విహరిస్తున్న మాస్ మహారాజ రవితేజ. ఒక హిట్టు.. తర్వాత మూడు నాలుగు సినిమాలు ఫట్టు అన్నట్టుగా ఆయన టాలీవుడ్ ప్రయాణం సాగుతోంది. అయినా అలుపెరగకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు.

    Also Read: మెగాస్టార్ నుండి ఎమోషనల్ విషెస్ !

    తాజాగా ఈ సంక్రాంతి రేసులోకి రవితేజ వచ్చాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ వలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు.

    నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాజాగా ‘క్రాక్’ సినిమా ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. పవర్ ఫుల్ డైలాగులతో రవితేజ క్రాక్ పుట్టించారు. ‘శంకర్ పోతరాజు వీర శంకర్’ అంటూ ఘీంకరించాడు.

    Also Read: వీరత్వాన్ని మేల్కొలపాలంటున్న పవన్.. !

    హీరో వెంకటేశ్ వాయిస్ తో వచ్చిన ఒక పోలీసోడు అంటూ క్రాక్ ట్రైలర్ ఆరంభంలో కనువిందు చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

    ఇక సినిమాలో విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండడం విశేషం. ఇందులో రవితేజ-వరలక్ష్మీ ఎపిసోడ్స్ హైలెట్ అంటున్నారు. ఇక తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్