
Madhavi: 1980 దశకంలో హీరోయిన్ల మధ్య తీవ్ర పోటీ ఉండేది. విజయశాంతి, రాధ వంటి స్టార్లకు ఓ అందాల తార పోటీ ఇచ్చారు. ఆమె ఓ వైపు సాంప్రదాయ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు హాట్ భామగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ సాంగ్ తో ఇండస్ట్రీలో రికార్డు తిరిగేశారు. అప్పటి నుంచి ఆ నటితో సినిమాలో తీసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ కట్టారు. కానీ కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే ఆమె సినిమాల నుంచి తప్పుకుంది. ఆ తరువాత చాన్నాళ్లకు ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటి కాలం వారికి ఈమె తెలియకపోవచ్చు. కానీ అప్పటి యూత్ కు ఫేవరేట్ అయిన ఈమె గురించి తెలుసుకోండి.
‘రగులుతోంది మొగలిపొద’ అనే సాంగ్ వినిపించగానే మాధవి గుర్తుకొస్తుంది. ఈ సాంగ్ లో మాధవి చేసిన డ్యాన్స్, పర్ఫామెన్స్ ఇప్పటి వారెవరూ చేయరని కొందరు అంటున్నారు. మెగాస్టార్ తో ఈ సాంగ్ చేసిన ఆమె ఆయనతో పోటీగా డ్యాన్స్ చేయడం విశేషం. చిరంజీవి నటించిన ’ప్రాణంఖరీదు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మాధవి.. ఆ తరువాత ఇతర హీరోలతో తక్కువ సినిమాలు చేసింది. ఆమె నటించిన ‘మాతృదేవోభవ’ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే నిలుస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కమలహాసన్ తదితర స్టార్లతో నటించి మెప్పించింది.
కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే మాధవి సినిమాల నుంచి తప్పుకుంది. ఆ తరువాత అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిలయింది. వీరికి ముగ్గురు కూతుళ్లు. భర్త చేసే బిజినెస్ కు మాధవి తోడుగా ఉంటోంది. అయితే మాధవి ముగ్గురు పిల్లల తల్లి అయినా ఆమె లేటేస్ట్ ఫొటోల్లో ఎంతో అందంగా ఉన్నారని అంటున్నారు. మరికొందరు మళ్లీ సినిమాల్లో నటించండి.. అంటూ కోరుతున్నారు.

చాలా మంది నాటి హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తున్నారు. కొందరు మళ్లీ మళ్లీ సినిమాల్లోకి వస్తూ అలరిస్తున్నారు. కానీ మాధవి మాత్రం సినిమాలు మానేశాక మళ్లీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూడలేదు. కనీసం మీడియా ముందుకు వచ్చి తనను పరిచయం చేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. తన ఫ్యామిలీతో కలిసి దిగిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.