
Top 10 Cars : సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండడంతో చాలా మంది కార్ల కొనుగోలుపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మరోవైపు ఏప్రిల్ లో కార్ల ధరలు పెరుగుతన్నాయన్న ప్రచారంతో చాలా మంది కొత్త మోడళ్లను మార్చిలో బుక్ చేసుకున్నారు. దీంతో ఈ నెలను కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. గతేడాది అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది 30 వేల కార్లు అత్యధికంగా విక్రయించినట్లు లెక్కలు చెబుతున్నాయి. భారత మార్కెట్ లో 2022 మార్చి లో 3,02,729 యూనిట్లు విక్రయించగా.. ఈ మార్చిలో 3,34,245 కార్ల అమ్మకాలు జరిపింది. వీటిలో మారుతి సుజుకి ముందుండగా. ఆ తరువాతి స్థానాల్లో హ్యుండాయ్, టాటా మోటర్స్ ఉన్నాయి. మరి ఏ కంపెనీ ఎన్ని కార్లు విక్రయించిందో తెలుసుకుందాం.
మారుతి సుజుకి:
2023 మార్చి నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మారుతి సుజుకి ముందుంది.ఈ కంపెనీ నుంచి రిలీజైన బ్రెజ్జా 16,227 యూనిట్లను విక్రయించి SUVల్లో నెంబర్ వన్ గా నిలిచింది. ఆ తరువాత స్థానంలో జుసుకి బాలెనో 16,168 అమ్మకాలతో ఉంది. దీని తరువాత నెక్సాన్ 14,769 యూనిట్లు, క్రెటా 14,026 యూనిట్లతో మిడ్ సైజ్ SUVలుగా నిలిచాయి. మారుతి కంపెనీ నుంచి బెస్ట్ సెల్లగా డిజైర్ కూడా నిలిచింది. 13,394 యూనిట్ల విక్రయంతో టాప్ 10 లిస్టుకు చేరింది. ఈకో 11, 995 యూనిట్లు అమ్ముడుపోయింది.
హుందాయ్:
హుందాయ్ మోటార్స్ మార్చి 2023లో 50,600 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 44,600 అమ్మకాలు జరరిపింది. దీంతో ఈ సంవత్సరం 13.45 శాతం అమ్మకాలు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.
మహీంద్రా:
మార్చి నెలలో మహీంద్రా 35, 997 యూనిట్లను విక్రయించింది. ఏడాది క్రితం 27,603 విక్రయాలు జరిపింది. మహీంద్రా థార్, XUV700, కొత్త స్కార్పియన్ N అత్యధికంగా అమ్మడు పోయినట్లు తెలుస్తోంది.
టయోటా:
టయోటా కిర్లోస్కర్ 18,670 యూనిట్లు అమ్మింది. ఈ కంపెనీ నుంచి ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా క్రిస్టా, హిలక్స్ వంటి మోడల్స్ కు మార్చి నెలలో డిమాండ్ పెరిగింది. ఈ కంపెనీ ఫిబ్రవరి కంటే మార్చిలో 9 శాతం వృద్ధి సాధించింది.
టాటా:
టాటా కంపెనీ మార్చిలో 44,044 యూనిట్లను విక్రయించింది. టాటా టియాగో, ఆల్ట్రో టియాగో, ఆల్ట్రోజ్, నెక్సాన్ హరియార్, న్యూ సఫరా, టిగోర్ మోడల్స్ 4 నుంచి 5 స్టార్ రేటింగ్ ను పొందాయి. కొత్త డిజైన్ లాంగ్వేజ్ లో అత్యుత్తమ విక్రయాలు జరిపే మోడళ్లు ఈ కంపెనీ నుంచే ఉండడం విశేషం.
వీటితో పాటు ఎంజీ మోటార్స్ 6,051 యూనిట్లు, ఎంజీ మోటార్ ఇండియా 28.17 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది.