
Rakshita: పూరి జగన్నాధ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన భామల్లో రక్షిత ఒకరు. బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ని షేక్ చేశారు. మహేష్, ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, బాలయ్య వంటి టాప్ స్టార్స్ తో జతకట్టారు. ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించి చాలా కాలం అవుతుండగా… లేటెస్ట్ లుక్ చూస్తే షాక్ అవుతారు. రక్షిత చాలా లావయ్యారు. దివంగత స్టార్ పునీత్ రాజ్ కుమార్ డెబ్యూ మూవీ అప్పు రక్షిత మొదటి చిత్రం. కన్నడలో అప్పు సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే కథను పూరి తెలుగులో ఇడియట్ గా రీమేక్ చేశాడు. రవితేజ హీరోగా 2002లో విడుదలైన ఇడియట్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది.
మూవీ బంపర్ హిట్ కావడంతో హీరోయిన్ రక్షిత పేరు మారుమ్రోగింది. ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. దర్శకుడు తేజ రక్షితకు మహేష్ పక్కన నిజం మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. మహేష్ వెనుక పడే అల్లరి అమ్మాయి పాత్రలో రక్షిత మెప్పించారు. పూరి ఆమెకు వరుస ఛాన్స్ లు ఇచ్చాడు. శివమణి, ఆంధ్రావాలా చిత్రాల్లో హీరోయిన్ గా తీసుకున్నాడు. కన్నడ, తెలుగు భాషల్లో చిత్రాలు చేస్తూ వచ్చారు. అయితే ఆమెకు పెద్దగా హిట్స్ పడలేదు. అందుకే ఆమె కెరీర్ గ్రాఫ్ త్వరగా పడిపోయింది.
చిరంజీవికి జంటగా నటించిన అందరివాడు నిరాశపరిచింది. శ్రీను వైట్ల తెరకెక్కించిన అందరివాడు మూవీలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత కూడా ఉండదు. ఇక తెలుగులో ఆమె చివరి చిత్రం జగపతి. ఆ చిత్రంలో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేశారు. 2007 వరకు వరుసగా కన్నడ చిత్రాలు చేశారు. అప్పుడే దర్శకుడు ప్రేమ్ కి దగ్గరయ్యారు. 2007లో ప్రేమ్ ని వివాహం చేసుకున్నారు. పెళ్ళయాక నటనకు విరామం చెప్పారు. రక్షిత-ప్రేమ్ లకు ఒక అబ్బాయి. అతని పేరు సూర్య. ఇప్పుడు టీనేజ్ లో ఉన్నాడు.

పెళ్లయ్యాక రక్షిత విపరీతంగా లావయ్యారు. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. నటనకు గుడ్ బై చెప్పినప్పటికీ రక్షిత పరిశ్రమకు దూరం కాలేదు. నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించారు. జోగయ్య, డీకే, ఏక్ లవ్ య అనే కన్నడ చిత్రాలు ఆమె నిర్మించారు. చాలా గ్యాప్ తర్వాత 2022లో ‘ఏక్ లవ్ య’ మూవీలో చిన్న పాత్ర చేశారు. స్టార్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్స్ చూసిన రక్షిత వివాహం చేసుకుని గృహిణిగా మారిపోయారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు.