
BB Jodi TRP Rating: జబర్దస్త్ నానాటికి పూర్ రేటింగ్స్ నమోదు చేస్తోంది.. అందులో కామెడీ మొనాటనిగా మారింది.. పోటీగా ఇంకో షో లేదు కాబట్టి బతికి బట్ట కడుతోంది.. వాస్తవానికి ఈటీవీని నిలబెడుతున్నవి జబర్దస్త్, ఢీ మాత్రమే.. అలాంటి ఢీ షో కూడా నానాటికి పలచన అయిపోతుంది.. పిచ్చి సర్కస్ ఫీట్లు, ఆది ర్యాగింగ్, డైలాగులచో అయిపోయిన తర్వాత… ఆహా టీవీ ఓ డ్యాన్స్ షో ను హిట్ చేసుకుంది. ఆ షోలో నాణ్యత కనిపించింది. ఏదో కామెడీ షో గా, పంచుల ప్రోగ్రామ్ గా మార్చకుండా డాన్స్ మీద కాన్సెంట్రేట్ చేశారు. ఇప్పుడు మాటీవీ ప్రొఫెషనల్ డ్యాన్సర్లను కాకుండా బిగ్ బాస్ వివిధ సీజన్ల కంటెస్టెంట్లతో జోడీలు కూర్చి, వారితో డ్యాన్స్ షో చేయిస్తున్నారు. ఇప్పుడు అది హిట్ అయింది. ఈటీవీ ఢీ షోలో ప్రొఫెషనల్ డాన్సర్లు కూడా వెలవెలబోతున్నారంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
ఢీ షోలో కంటెస్టెంట్లు మస్తు సర్కస్ ఫీట్లు చేస్తారు. పాటకు తగిన ఫీలింగ్స్ ప్రదర్శించే అవసరం లేదు. పైకి ఎగిరి దూకావా? హిప్ మొమెంటు ఎలా ఇచ్చావు? ఫ్లిప్ కొట్టావా? జిమ్నాస్టిక్స్ చూపించావా? ఇదే లెక్క? దాన్ని డ్యాన్స్ అనుకోవాలని దబాయిస్తుంది మల్లెమాల.. ఇక జెస్సీ… అది ఒక నాసిరకం కామెడీ.. ఒక్కసారి అక్కడ కట్ చేసి, స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే బీబీ జోడీకి రండి. అసలు ఈ షో మొదలయ్యే ముందు ఈ రేంజ్ లో క్లిక్ అవుతుందని ఎవరూ అనుకోలేదు.
ఎందుకంటే వాళ్లకు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండదు. కాళ్ళు, కీళ్ళు స్టెప్పులకు సహకరించవు.. అయితేనేం తీవ్రంగా కష్టపడ్డారు. నేర్చుకున్నారు, ఒళ్ళు వంచారు, చెమటోడ్చారు.. కొన్ని పాటల్లో ప్రొఫెషనల్ డాన్సర్లకు దీటుగా చేశారు.. వీళ్ళ స్టెప్పులకు మరో అడ్వాంటేజ్ ఏమిటంటే.. వీళ్లు ఫీలింగ్స్ ప్రదర్శించగలరు. దీంతో పాటలు కాస్త రక్తి కడుతున్నాయి.

గతవారం బార్క్ హైదరాబాద్ రేటింగ్స్ చూస్తే ఢీ కేవలం 3.33 జి ఆర్ పి రేటింగ్ నమోదు చేసింది. అదే బిగ్ బాస్ జోడి 3.98 జి ఆర్ పి రేటింగ్స్ నమోదు చేసింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొదట్లో ఈ కంటెస్టెంట్లు కాస్త తడబడినప్పటికీ.. ఇప్పుడు రెచ్చిపోయి చేస్తున్నారు. ఇక జీ తెలుగులో మొన్న ఫినాలే అయిపోయిన డాన్స్ ఇండియా డాన్స్ అట్టర్ ప్లాప్ షో.. ఇందులో సంగీత, బాబా మాస్టర్, ఆనందిని ని జడ్జిలుగా కూర్చోబెట్టారు.. మొత్తానికి బోర్ షో. దాని రేటింగ్స్, గ్రాండ్ ఫినాలే కి వచ్చిన జిఆర్పిలు జస్ట్ అంటే అట్టర్ ఫ్లాప్ షో అన్నమాట.
ఈ బీబీ జోడీ లో ముక్కు అవినాష్ అరీయానా గ్లోరీ, అఖిల్ తేజస్వి, మహబూబ్ ఆశు రెడ్డి, రవికృష్ణ భాను శ్రీ, రోల్ రైడా ఇనయా సుల్తానా, అర్జున్ కళ్యాణ్ వాసంతి కృష్ణన్, ఆర్ జె సూర్య ఫైమా, ఆర్ జె చైతు ఆర్జె కాజల్.. వీళ్లే కాకుండా కౌశల్ అభినయ వచ్చి చేరారు. మొదట్లో కనిపించిన రోల్ రైడా, ఇనయా సుల్తానా ప్రస్తుతం లేరు.. మిగిలిన జంటల్లో అర్జీ చైతు పూర్ పెర్ఫార్మర్.. తనకు అంత ఈజ్ లేదు. ఆర్ జె సూర్య తన శక్తికి మించి కష్టపడుతున్నాడు. కౌశల్ అభినయ జంటలో కౌశల్ పూర్ పెర్ఫార్మెన్స్.. మాటలు ఎక్కువ.. తనలో దమ్ము తక్కువ.. ఇక చెప్పుకోదగిన జంటల్లో అర్జున్ కళ్యాణ్ వాసంతి, రవి కృష్ణ భాను శ్రీ, అఖిల్ తేజస్వి, అవినాష్ అరియానా బాగా చేస్తున్నారు.. మొదట్లో మహబూబ్ ఆషు రెడ్డి తో చేసేవాడు.. శ్రీ సత్య వచ్చి చేరాక ఆ జంట కూడా బాగా చేస్తోంది.. ప్రస్తుతానికి అఖిల్ తేజస్వి టాప్ అనిపిస్తోంది.. ఇక ఈ షో కు అలనాటి హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్, సదా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అన్నట్టు జంటల మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ అదుపుతప్పుతోంది.. అది మరీ అంత అశ్లీలంగా లేకపోయినప్పటికీ.. టీవీ చూసేది ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి వారిని కూడా దృష్టిలో ఉంచుకుంటే మంచిది.
