
Mahesh Babu- Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే,ఈమధ్యనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది..ఒక షెడ్యూల్ పూర్తి అవ్వగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ ఇంటి సెట్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నిర్మిస్తున్నారు.ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ AS ప్రకాష్ ఆద్వర్యం లో ఈ సెట్స్ ని నిర్మిస్తున్నారు.
సుమారు పది కోట్ల రూపాయిలను ఈ సెట్ కోసం ఖర్చు చేస్తున్నాడట ఈ సినిమా నిర్మాత సూర్య దేవరనాగవంశీ..మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సెట్ లో కేవలం 5 నుండి 10 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాన్ని మాత్రమే చిత్రీకరిస్తున్నారట, అంత చిన్న సన్నివేశం కోసం ఇంత భారీ సెట్ వేస్తున్నారా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడట..మహేష్ బాబు ని సరికొత్త యాంగిల్ లో చూపించాలంటే త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా.మహేష్ కెరీర్ ని ఒకసారి పరిశీలిస్తే ఖలేజా చిత్రానికి ముందు, ఖలేజా చిత్రానికి తర్వాత అని చెప్పొచ్చు.ఎందుకంటే అంతకు ముందు మహేష్ కేవలం తక్కువ మాటలతో యాక్టింగ్ చేసేవాడు,మహేష్ కామెడీ టైమింగ్ గురించి పెద్దగా ఎవరికీ అప్పట్లో తెలీదు.ఎప్పుడైతే ఖలేజా సినిమా వచ్చిందో అప్పటి నుండి మహేష్ లో ఇంత కామెడీ టైమింగ్ ఉందా అని ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది..ఇక అప్పటి నుండి మహేష్ అదే టైపులో యాక్టింగ్ చేసుకుంటూ వచ్చాడు..ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఆ యాంగిల్ లో ఉన్న మహేష్ ని తెగ ఇష్టపడ్డారు, ఇప్పుడు మహేష్ లో ప్రస్తుతం చేస్తున్న సినిమా ద్వారా మరో కొత్త కోణాన్ని బయటకి తియ్యబోతున్నాడట త్రివిక్రమ్.

ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ లుక్ లీక్ అయ్యి వైరల్ గా మారింది.మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతం లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు మంచి సినిమాలుగా గా నిలిచినప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు..కానీ ఈసారి మాత్రం కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అన్నట్టుగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడట,ఈ ఏడాది లోనే విడుదల అవ్వబోతున్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలియాలంటే ఆగష్టు వరకు వేచి చూడాల్సిందే.