
Jagadam Heroine: డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ సుకుమార్ మూవీస్ మాస్ మసాలాతో ఆకట్టుకుంటాయి. ఆయన తీసిన మొదటి మూవీ ‘ఆర్య’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఆయనతో సినిమా తీయాలని చాలా మంది హీరోలు క్యూ కట్టారు. ఆర్య తరువాత సుకుమార్ భారీ యాక్షన్ మూవీ ‘జగడం’ తీశారు. ఇందులో రామ్ పోతినేనిని హీరోగా తీసుకున్నాడు. ప్రదీప్ రావత్ లాంటి సీనియర్ యాక్టర్లతో ఫైట్ షూట్ చేయించి సినిమాకు హైప్ తీసుకొచ్చారు.
2007లో వచ్చిన ఈ సినిమా కంటెంట్ కాస్త ఆలోచింపజేసినా హిట్టును అందుకోలేదు. కానీ ఇప్పుడు టీవీల్లో వస్తే మాత్రం ప్రతి ఒక్క యూత్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ సినిమాలో రామ్ కు జోడిగా నటించిన భామ హద్దు పద్దులు లేకుండా రొమాన్స్ కు సై చెప్పింది. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ అనిపించుకుంది. ఈ సినిమాలో నటించిన ఆమెను ఇప్పుడు చూసి షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ భా పేరేంటో తెలుసా?

జగడం సినిమాలో నటించిన హీరోయిన్ పేరు ఇషా సహని. ఈ హాట్ బ్యూటీ రామ్ తో చేసిన విన్యాసం అప్పట్లో ఆకట్టుకుంది. అయితే సినిమా యావరేజ్ గా నిలవడంతో ఈమెకు గుర్తింపు రాలేదు. పైగా ఈ ఒక్క సినిమాలోనే నటించిన ఆమె మళ్లీ తెరపై కనిపించలేదు. తమిళంలో ‘బ్యాడ్ బాయ్’ అనే సినిమాలో మెరిసిన ఈమె ఆ తరువాత ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. సినిమాల్లోనూ అమెకు అవకాశాలు లేకపోవడంతో ఓ వ్యక్తిని పెల్లి చేసుకొని లండన్లో సెటిలయింది. అప్పటి నుంచి మళ్లీ వెండితెరవైపు చూడలేదు.
సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా లేని ఈ భామ కు సంబంధించిన ఫొటోలు కొందరు నెట్టంట్లో అప్లోడ్ చేశారు. జగడం సినిమా సమయంలో ఎంతో క్యూట్ గా ఉన్న ఈమె ఇప్పుడు గుర్తుపట్టకుండా మారిపోయింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ చాలా మారిపోయావ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవల ఓ చానెల్ లో జగడం సినిమా వస్తే మాత్రం ఆమెను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.