Homeక్రీడలుGujarat Titans: ఐపీఎల్ లో గుజరాత్ కు ఎదురేది.. 20 మ్యాచ్ ల్లో 15 విజయాలా?

Gujarat Titans: ఐపీఎల్ లో గుజరాత్ కు ఎదురేది.. 20 మ్యాచ్ ల్లో 15 విజయాలా?

Gujarat Titans
Gujarat Titans

Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ జట్టుకు ఐపీఎల్ లో రెండో సీజన్ మాత్రమే. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో మొదటిసారి గతేడాది ఐపీఎల్ లో జట్టు ప్రవేశించింది. ఐపీఎల్ లో ప్రవేశించిన మొదటి ఏడాది టైటిల్ గెల్చుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. సమష్టి ప్రదర్శనతో విజయకేతనం ఎగురవేసింది. రెండో సీజన్ కూడా జట్టు అదరగొడుతోంది. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది గుజరాత్ జట్టు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టు అదరగొడుతోంది. ఈ లీగ్ లో అడుగు పెట్టిన మొదటి ఏడాది టైటిల్ గెల్చుకొని అందరిని ఆశ్చర్యాన్ని గురి చేయగా.. రెండో ఏడాది అయిన ఈ సీజన్ లోను టైటిల్ హాట్ ఫేవరెట్ గా, డిపెండింగ్ ఛాంపియన్ గా గుజరాత్ జట్టు బరిలోకి దిగింది. ఈ సీజన్లోనూ ఛాంపియన్ ఆట తీరుతో దూసుకు వెళుతోంది గుజరాత్ జట్టు. ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా మూడు విజయాలను సొంతం చేసుకుంది. దీంతో టైటాన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించిన గుజరాత్..

తాజాగా గుజరాత్ జట్టు పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడింది. బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆ తరువాత గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ చాలా కాలం తర్వాత ఐపీఎల్ కు తిరిగి వచ్చాడు ఈ మ్యాచ్ తో. నాలుగు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అదే సమయంలో యువ బ్యాట్స్ మెన్ సుబ్ మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. 49 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు ఒక సిక్స్ ఉంది.

Gujarat Titans
Gujarat Titans

20 మ్యాచ్ ల్లో.. 15 విజయాలు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 20 మ్యాచ్ లు ఆడగా.. ఇందులో 15 మ్యాచ్ ల్లో విజయాలు సాధించింది. తొలి 20 మ్యాచ్ ల్లో ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి సీజన్లో ఛాంపియన్ గా నిలిచింది. తొలి 20 మ్యాచ్ ల్లో 15 మ్యాచులు కూడా గెలిచింది. ఇది కాకుండా పంజాబ్ కింగ్స్ తమ తొలి 20 మ్యాచ్ ల్లో 13 విజయాలు సాధించింది.

రికార్డు సృష్టించిన గుజరాత్ జట్టు..

టార్గెట్ చేజింగ్ లోనూ గుజరాత్ టైటాన్స్ రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడగా.. 11 మ్యాచ్ ల్లో ఆ జట్టు విజయం సాధించింది. గత సీజన్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఒక మ్యాచ్ లో మాత్రమే వాటిని పాలైంది. ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెల్చుకోగా.. చెన్నై జట్టు నాలుగు సార్లు టైటిల్ గెల్చుకుంది. కానీ, ప్రస్తుత సీజన్ లో ఇరు జట్ల ఆరంభం ప్రత్యేకంగా లేదు. చెన్నై జట్టు నాలుగు మ్యాచ్ ల్లో రెండు గెలిచింది. ముంబై జట్టు మూడు మ్యాచ్ ల్లో ఒక దానిలో మాత్రమే విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ జట్టులో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. హ్యాట్రిక్ కూడా తీశాడు. నాలుగు మ్యాచ్ ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్ కూడా ఏడేసి వికెట్లు తీశారు. బ్యాటింగ్ విభాగంలో గిల్ నాలుగు మ్యాచ్ ల్లో రెండు అర్థ సెంచరీలు సహాయంతో గరిష్టంగా 183 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ కూడా రెండు అర్థ సెంచరీలు సాయంతో 156 పరుగులు చేశాడు.

ఆందోళన కలిగిస్తున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా..

ప్రస్తుతం ఇటు బ్యాటింగ్ విభాగంలో, బౌలింగ్ విభాగంలో అదరగొడుతున్న గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 3 ఇన్నింగ్స్ ల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 8 పరుగులే అత్యుత్తమ ప్రదర్శన. ఫాస్ట్ బౌలర్ గా ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. ఏప్రిల్ 16న జరిగే రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో అయినా హార్దిక్ పాండ్యా ఫామ్ లోకి వస్తాడని జట్టుతో పాటు అభిమానులు ఆశిస్తున్నారు. రాయల్స్ జట్టు కూడా నాలుగు మ్యాచ్ ల్లో మూడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

Exit mobile version