Pawan Kalyan Remuneration: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది ఇటీవల వచ్చిన ఒక ప్రకటన ఇండస్ట్రీ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనం అందరం చూసాము..#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుండి రాబోతున్న సినిమా ఇది..ఈ చిత్రం కోసం నిర్మాత దానయ్య దాదాపుగా 170 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ పెట్టబోతున్నాడు..మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కబోతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని బాషలలో తెరకెక్కించబోతున్నారు.

సుజీత్ పవన్ కళ్యాణ్ కి ఒక వీరాభిమాని..అతనితో సినిమా చెయ్యడానికే ఇండస్ట్రీ కి వచ్చాడు..చివరికి సాధించాడు..షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ కాలం గడిపిన సుజీత్ ఇప్పుడు ఇండియా లోనే బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలను పెట్టి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తీసే రేంజ్ కి ఎదిగాడంటే మాములు విషయం కాదు.
ఇక ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య కళ్ళు పవన్ కళ్యాణ్ కి కళ్ళు చెదిరిపొయ్యే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం..గత చిత్రాలకు 60 కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ కి ఈ చిత్రం లో నటించడం కోసం ఏకంగా 70 నుండి 80 కోట్ల రూపాయిల పారితోషికం అందుకుతున్నట్టు తెలుస్తుంది..ఇప్పటికి ఆయన పాతిక కోట్ల రూపాయిల అడ్వాన్స్ కూడా ఇచేసినట్టు సమాచారం..షూటింగ్ లో పాల్గొనే సమయానికి మిగిలిన డబ్బులు కూడా ఇచేయబోతున్నారట..ఫిబ్రవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా కావడం తో పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా భారీగా ఇచ్చేశాడట..2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు మొదలుపెట్టారు..ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా థమన్ ని తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తుంది..కానీ ఫ్యాన్స్ మాత్రం అనిరుధ్ ని కోరుకుంటున్నారు..వీళ్ళిద్దరిలో ఎవరు ఖరారు అవ్వబోతున్నారో చూడాలి.