Sudigali Sudheer- Dil Raju and Allu Aravind: ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ లేని ఒక వ్యక్తి నిలదొక్కుకోవడం చాలా కష్టమే..అపారమైన ప్రతిభ మాత్రమే ఉంటె సరిపోదు..లక్ కూడా ఉండాలి..ఈ రెండు సమపాళ్లలో ఉన్నవాళ్లే ఇండస్ట్రీ లో స్టార్స్ గా వెలుగొందారు..ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు..పొట్టకూటి కోసం ఈవెంట్స్ లో మ్యాజిక్ షోలు చేసుకుంటూ కెరీర్ ని ప్రారంభించిన సుడిగాలి సుధీర్ హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో చాలా కష్టాలే పడ్డాడు..అన్నం నీళ్లు లేక బాధపడుతున్న రోజులవి.

అలాంటి సమయం లో ఈటీవీ లో జబర్దస్త్ అనే పాపులర్ కామెడీ షో లో వేణు వండర్స్ టీం లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ తన బుల్లితెర కెరీర్ ని ప్రారంభించాడు..తనలోని అద్భుతమైన కామెడీ టైమింగ్ ని గమనించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ టీం లీడర్ గా చేసింది..సుధీర్ టీం లీడర్ అయినా తర్వాత ఆయన ఏ రేంజ్ కి ఎదిగాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఎప్పుడైతే సుధీర్ టీం లీడర్ అయ్యాడో..అప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..ఒకానొక్క దశలో ఈటీవీ లో సుడిగాలి సుధీర్ లేనిదే ఎంటర్టైన్మెంట్ షోస్ లేవు అనే రేంజ్ కి ఎదిగాడు..బుల్లితెర కెరీర్ పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయంలోనే సుధీర్ కి సినిమాల్లో హీరో గా నటించే అవకాశాలు వచ్చాయి..అందువల్ల ఆయన ఈటీవీ ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది..బంగారం లాంటి జీవితం ని వదులుకొని సినిమాల్లోకి వెళ్లి సుధీర్ పెద్ద పొరపాటు చేస్తున్నాడు..ఇక ఆయన కెరీర్ ముగిసినట్టే అని అందరూ అనుకున్నారు..కానీ రీసెంట్ గా సుధీర్ హీరో గా నటించిన గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

టాక్ సరిగా లేకపోయినా కూడా కేవలం సుధీర్ పేరు మీద సినిమా హిట్ అయిపోవడం ఇండస్ట్రీ లో పెద్దలతో పాటుగా , ట్రేడ్ వర్గాలను కూడా షాక్ కి గురి చేసింది..ఇప్పుడు సుధీర్ తో సినిమాలు తియ్యడం కోసం ఒక పక్క దిల్ రాజు మరోపక్క అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ లాక్ చేసుకున్నారు..ఇక సినిమా హీరో గా కూడా సుధీర్ కెరీర్ గాడిలో పడినట్టే..చూడాలి మరి భవిష్యత్తులో ఆయన కెరీర్ ఎన్ని మలుపులు తిరుగుతుందో.