
Sreeleela Remuneration: మన టాలీవుడ్ లో కేవలం ఒకేఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.సమంత,తమన్నా, నయనతార ఇలాంటి వాళ్ళే.ఇప్పుడు ఆ జాబితాలోకి మరో కుర్ర హీరోయిన్ వచ్చేసింది.ఆమె పేరే శ్రీలీల,తొలి సినిమా ‘పెళ్లి సందడి’ తోనే ఈమె తన అందం , అభినయం మరియు అద్భుతమైన నటనతో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది.ఆ తర్వాత ఈమె చేసిన రెండవ చిత్రం ‘ధమాకా’ కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో విషయం పెద్దగా లేకపోయినా కూడా, కేవలం శ్రీలీల మాస్ డ్యాన్స్ కోసం ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టేసారు.శ్రీలీల లో ఉన్న ఈ అద్భుతమైన టాలెంట్ ఇప్పుడు ఆమెకి అవకాశాలు వెల్లువలాగా కురిసేలా చేస్తున్నాయి.ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు సినిమాలతో పాటుగా కుర్ర హీరోల సినిమాలన్నీ కలిపి 10 సంఖ్య దాటిందని తెలుస్తుంది.
కానీ నిర్మాతలు మాత్రం ఈంకి యూత్ లో ఉన్న క్రేజ్ కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ మాత్రం ఇవ్వడం లేదు.కేవలం కోటి రూపాయలతో సరిపెట్టుకోమని వత్తిడి చేస్తున్నారట.అది కూడా పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే, అదే మీడియం రేంజ్ హీరో సినిమాకి అయితే కోటి రూపాయిల లోపే రుమేనిరేషన్ ఇస్తామని చెప్పారట.కానీ శ్రీలీల మాత్రం కోటి 50 లక్షల రూపాయిలు ఇస్తేనే కాల్ షీట్స్ ఇస్తానంటూ నిర్మాతలకు తెగేసి చెప్పిందట.

కానీ మీడియం రేంజ్ హీరోల సినిమాలకు మాత్రం అంత డిమాండ్ చేయట్లేదట శ్రీలీల.ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమాలలో ఒక్క భారీ హిట్ తగిలినా ఆమె పారితోషికం అమాంతం 4 నుండి 5 కోట్ల రూపాయలకు ఎగబాకిన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తుంది.ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయికి ఈరోజు టాలీవుడ్ లో ఇంత డిమాండ్ ఉండడం చూసి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోతున్నారు.