
Rana Naidu: విక్టరీ వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో అందరికీ తెలిసిందే.ఆయన సినిమాలకు థియేటర్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో, టీవీలలో కూడా అంతే క్రేజ్ ఉంటుంది.ఆయన సినిమా టీవీ లో వస్తుందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ తమకి ఉన్న పనులన్నీ పక్కకి నెట్టి టీవీలకు అతుక్కుపోతారు,ఇన్నేళ్ల వెంకటేష్ సుదీర్ఘ సినీ కెరీర్ లో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగానే ఉంటాయి.
అలాంటి వెంకటేష్ తొలిసారి కుటుంబ సబ్యులకు ఏమాత్రం నచ్చని సిరీస్ తో మన ముందుకు రాబోతున్నాడు.ఆ చిత్రం పేరే ‘రానా నాయుడు’.ఈ సినిమాలో వెంకటేష్ తో పాటుగా ఆయన అబ్బాయి దగ్గుపాటి రానా కూడా మరో హీరో గా నటించాడు.ఎప్పుడో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావాల్సిన ఈ రానా నాయుడు కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.మొత్తానికి ఈ సిరీస్ ఈ నెల 10 వ తారీకు నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది.నేటితరం యూత్ మొత్తం అడల్ట్ డైలాగ్స్ ఉన్న కంటెంట్ కి బాగా కనెక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే.అందుకే రాననాయుడు ని పూర్తి స్థాయి అడల్ట్ డైలాగ్స్ తో నింపేశారు.రీసెంట్ గా ఈ సిరీస్ ప్రొమోషన్స్ లో పాల్గొన్న దగ్గుపాటి రానా ‘ఈ చిత్రం వెంకటేష్ అభిమానులను ఏమాత్రం కూడా నిరాశపర్చదు, కాకపోతే ఇన్ని రోజులు వెంకటేష్ సినిమాలు అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే విధంగా ఉండేవి, కానీ ఈ సినిమా మాత్రం అలా ఉండదు.ఫ్యామిలీ తో మీ స్నేహితులతో కానీ, లేదా ఒంటరిగా కానీ చూసుకోండి’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు రానా.ఇందులో వెంకటేష్ – రానా తండ్రి కొడుకులుగా నటించారు కానీ ట్రైలర్స్ లో వీళ్లిద్దరు ఎప్పుడూ ఒకరినొక్కరు తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి మాత్రమే చూసాము.దానికి వెనుక ఎంత కథ ఉంది అనేది తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.