Teams With Most 400+ Scores In ODIs: క్రికెట్ అంటేనే బంతికి, బ్యాట్ కు మధ్య సమరం. ఎక్కువ పరుగులు చేసి ఆస్కోరును కాపాడుకున్న జట్టే గెలుస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకు 250 పరుగులే గౌరవప్రద స్కోర్ గా ఉండేది. టి20 మ్యాచ్ లు ఊపిరి పోసుకున్నాకా పరిస్థితి మారింది. 200 కాదు 400 స్కోర్ కొట్టేందుకు కూడా జట్లు వెనుకాడటం లేదు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 409 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు. వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. అయితే ఇప్పటివరకు చాలా జట్లు 400 పరుగులు సాధించాయి. వీటిలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ఎప్పటికీ ప్రత్యేకం.

సౌత్ ఆఫ్రికా ఆరుసార్లు
వన్డేల్లో అత్యధికంగా 400 పై చిలుకు పరుగులు సాధించిన జట్టుగా సౌత్ ఆఫ్రికా పేరిట రికార్డు ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆరుసార్లు ఈ ఘనత సాధించింది. బంగ్లాదేశ్ పై ఈరోజు జరిగిన మ్యాచ్లో 409 పరుగులు చేయడం ద్వారా ఇండియా సౌత్ ఆఫ్రికా సరసన చేరింది. ఇంగ్లాండ్ నాలుగుసార్లు, ఆస్ట్రేలియా రెండుసార్లు, శ్రీలంక రెండుసార్లు ఈ ఘనత సాధించాయి. వాస్తవంగా వన్డే మ్యాచ్లో 300 స్కోర్ అంటే బ్యాట్స్మెన్ బాగా ఆడినట్టు లెక్క. కానీ 400 పరుగులు అంటే మామూలు విషయం కాదు.. అయితే ఈ 400 పరుగుల స్కోరుకు శ్రీకారం చుట్టింది మాత్రం ఆస్ట్రేలియా జట్టే. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది..అనంతరం చేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్లు కోల్పోయి 438 పరుగులు సాధించి రికార్డ్ సృష్టించింది. తర్వాత 2006లో శ్రీలంక జట్టు నెదర్లాండ్స్ జట్టు మీద 9 వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసింది. 2006- 2007 సంవత్సరానికి సంబంధించి సౌత్ ఆఫ్రికా జట్టు జింబాబ్వే మీద ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది.

2007లో భారత జట్టు బెర్ముడాపై ఐదు వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. 2008లో న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి ఐర్లాండ్ జట్టుపై 402 పరుగులు చేసింది. 2009-10 లో భారత జట్టు శ్రీలంక పై 8 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. 2009-10 లో శ్రీలంక భారత జట్టుపై 8 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. 2009_10 లో ఇండియా జట్టు మూడు వికెట్లు కోల్పోయి సౌత్ ఆఫ్రికా మీద 401 పరుగులు చేసింది. 2011_12 లో ఇండియా జట్టు వెస్టిండీస్ పై ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది.. 2014- 15లో శ్రీలంక జట్టు మీద ఇండియా 5 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది.. 2014-15 లో సౌత్ ఆఫ్రికా రెండు వికెట్ల నష్టానికి వెస్టిండీస్ మీద 439 పరుగులు చేసింది. 2014_15 సంవత్సరంలో అదే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ జట్టుపై ఐదు వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. 2014-15 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా ఐర్లాండ్ జట్టుపై నాలుగు వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది.. 2014_15 లో ఆస్ట్రేలియా జట్టు ఆఫ్ఘనిస్తాన్ పై ఆరు వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. 2015 లో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పై 9 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. 2015- 16 లో సౌత్ ఆఫ్రికా ఇండియా పై నాలుగు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది. 2016లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పై మూడు వికెట్లు నష్టానికి 444 పరుగులు చేసింది. 2018లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల నష్టానికి 481 పరుగులు చేసింది. ఇప్పటివరకు దీనినే ఒక రికార్డుగా చెబుతారు. ఇక 2019లో వెస్టిండీస్ న్యూజిలాండ్ పై 421 పరుగులు చేసింది. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా 409 పరుగులు చేసింది..
బ్యాట్లు పగిలేలా?
సాధారణంగా వన్డే మ్యాచ్లో 400 పై చిలుకు స్కోర్ అంటే మామూలు విషయం కాదు. ఒకరకంగా చెప్పాలంటే బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడితేనే ఇలాంటి పరుగులు సాధ్యమవుతాయి. కానీ ఇదే సమయంలో ఎంతోమంది బౌలర్లకు పీడ కలలు మిగులుతాయి. బ్యాటింగ్కు సహకరించే పిచ్ ల పై ఇలాంటి స్కోర్లు నమోదు అవుతాయి అనుకుంటే పొరపాటే… భారత ఉపఖండం అవతల ఉన్న బౌన్సీ మైదానాల్లోనూ భారీ స్కోర్లు నమోదు అవుతుండడం విశేషం. 400 పై చిలుకు స్కోరును చేదించిన రికార్డు ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మీదే ఉంది. 2005_06 సంవత్సరంలో జరిగిన ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 434 పరుగులు చేసింది. తర్వాత చేజింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా 438 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. సాధారణంగా ఇంతటి భారీ స్కోర్ నమోదైన మ్యాచుల్లో తిరిగి చేజింగ్ కు దిగిన జట్లు ఓటమిపాలయ్యాయి. అయితే టి20 ఫార్మాట్ వచ్చిన తర్వాత ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడుతున్నారు. ఇదే సమయంలో వీరికి బౌలింగ్ వేయడం బౌలర్లకు కత్తి మీద సామవుతోంది.