Waltair Veerayya Ravi Teja: టాలీవుడ్ లో ఈమధ్య క్రేజీ ప్రాజెక్ట్స్ చాలా తేలికగా సెట్ అయిపోతున్నాయి..మల్టీస్టార్ర్ర్ సినిమాలు ఒకప్పుడు తియ్యడానికి డైరెక్టర్స్ చాలా బయపడేవాళ్లు..కానీ ఇప్పుడు స్టార్ హీరోలు సైతం మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు..ఈ జనరేషన్ మాస్ హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి చేసిన #RRR సక్సెస్ అవ్వడం తో మరిన్ని క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమాలు పుట్టుకొస్తున్నాయి..ఆ కోవలోకి చెందిన సినిమానే మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం.

ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటించాడు..ఆయన పాత్ర నిడివి ఇందులో 45 నిమిషాల వరకు ఉంటుంది..ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని ఇందులో ఆయన పోషించాడు..విక్రమార్కుడు తర్వాత అంత పవర్ ఫుల్ పాత్రలో రవితేజ ని ఇందులో డైరెక్టర్ బాబీ చూపించినట్టు సమాచారం..అయితే ఈ సినిమాలో రవితేజ నటించడానికి ముందు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి ఈ సినిమాలోని రవితేజ పాత్ర కోసం మెగా హీరో ని చేయించాలనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ బాబీ..కానీ అప్పటికే చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తో చేసిన ‘ఆచార్య’ సినిమా విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో మళ్ళీ మెగా హీరో అంటే ఆడియన్స్ కి కాస్త రొటీన్ ఫీలింగ్ వస్తుందని చిరంజీవి రవితేజ ని సజస్ట్ చేసాడట..అప్పుడు వెంటనే రవితేజ ని డైరెక్టర్ బాబీ సంప్రదించి ‘ఇలా చిరంజీవి గారి సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్ర ఉంది..చేస్తారా’ అని అడగగానే స్టోరీ కూడా వినకుండా రవితేజ ఒప్పుకొని ఈ సినిమా చేసాడట..అప్పటికే ఆయన మూడు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు.

అందులో ‘రావణాసుర’ కూడా ఒకటి..ఈ సినిమా షూటింగ్ ని వాయిదా వేసిమరీ ‘వాల్తేరు వీరయ్య’ కోసం డేట్స్ కేటాయించాడట..మధ్యలో డైరెక్టర్ వేణుశ్రీరామ్ తో కూడా ఒక సినిమా చెయ్యాల్సి ఉంది..కానీ చిరంజీవి సినిమా కోసం ఆ చిత్రాన్ని కూడా వదిలేసాడట రవితేజ..ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..దీనిని బట్టి రవితేజ కి చిరంజీవి అంటే ఎంత అభిమాన అనేది అర్థం చేసుకోవచ్చు.