Charles Sobhraj: డబ్బు కనిపిస్తే చాలు దోచుకుంటాడు. బికినీతో అమ్మాయి కనిపిస్తే చాలు మదమెక్కిన మృగంలా రెచ్చిపోతాడు. తన అవసరం కోసం ఏదైనా చేస్తాడు. తనకు అడ్డొస్తే ఎవరినైనా వేసేస్తాడు.. ప్రభాస్ బిల్లా సినిమాలో డైలాగ్ మాదిరి “ట్రస్ట్ నో వన్. కిల్ ఎనీ వన్. బీ ఓన్లీ వన్.” ఎవరినీ నమ్మకు. ఎవరినీ వదలకు. నీకు నువ్వు గానే ఉండు. ఇదే సిద్ధాంతాన్ని కరడు కట్టిన హంతకుడు చార్లెస్ శోభరాజ్ తుది కంటా పాటించాడు. అతడు చేసిన హత్యలు రికార్డుల్లో 20 మాత్రమే.. కానీ అవి మూడు నాలుగింతలు ఎక్కువగానే ఉంటాయి.

ముంబై పోలీసులకు చిక్కాడు ఇలా
చార్లెస్ శోభరాజ్ ఒక భారతీయ తండ్రికి, వియత్నాం తల్లికి జన్మించాడు. అయితే అతడు చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో చార్లెస్ జీవితం అతలాకుతలమైంది.. పైగా అతని తల్లి మరో ఫ్రెంచ్ యువకుడితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది.. ఇది చార్లెస్ జీవితాన్ని గాయపరిచింది.. పైగా అతనినే పెళ్లి చేసుకోవడంతో.. చార్లెస్ గుండె ముక్కలైంది. మొదట్లో చార్లెస్ ను బాగానే చూసుకున్న పెంపుడు తండ్రి… తనకు పిల్లలు కలగగానే ఇతడిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో చార్లెస్ శోభరాజ్ నేర ప్రవృత్తికి దగ్గరయ్యారు.. ఇలా చిన్నచితకా నేరాలు చేస్తూ ఒక కరుడుగట్టిన నేరగాడిగా తయారయ్యాడు. 1986 ఏప్రిల్ 6న శోభరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఏప్రిల్ 5న చార్లెస్ గోవా వచ్చాడు. పార్వే రెమ్ అనే ప్రాంతంలో డ్రగ్స్ కు సంబంధించి లావాదేవీలు పర్యవేక్షించేందుకు, కొత్త డీల్స్ మాట్లాడేందుకు అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం రావడంతో ప్రాంతాన్ని చుట్టుముట్టారు.. చార్లెస్ బస చేసిన కొక్విరో రెస్టారెంట్ ను తమ ఆధీనంలో తీసుకున్నారు.. అందులో నుంచి పోలీసులు చార్లెస్ ను బయటకు తీసుకొచ్చారు.. తమ కదలికలు అనుమానం కలిగిస్తాయనే కారణంతో పోలీసులు సాధారణ దుస్తుల్లో అక్కడకు వెళ్లారు.. అప్పట్లో చార్లెస్ అరెస్టు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

మధుకర్ జెండే నేతృత్వంలో..
చార్లెస్ శోభరాజ్ అరెస్టు ముంబై పోలీస్ బృందంలోని మధుకర్ జెండే నేతృత్వంలో జరిగింది. అతడిని అరెస్టు చేయగానే ముంబై పోలీసు బృందం ప్రైవేట్ ట్యాక్సీ లలో శోభ రాజ్ ను తీసుకెళ్ళింది. తర్వాత కోర్టు విచారణ అనంతరం 21 సంవత్సరాలు శోభరాజ్ జైలు శిక్ష అనుభవించాడు. తన పుట్టినరోజు వేడుకల నెపంతో స్వీట్లు అందించిన సెక్యూరిటీ గార్డులకు మత్తుమందు ఇచ్చి తీహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. అంతేకాదు ఎదుటివారిని మోసం చేయడంలో శోభరాజ్ కు సాటి మరి ఎవరూ లేరు.. అందుకే అతనికి దీ సర్పెంట్ అనే మారుపేరు ఉంది.. బికినీ వేసుకున్న అమ్మాయిలను అతి కిరాతకంగా చంపాడు కాబట్టి అతడికి బికినీ కిల్లర్ అనే పేరు కూడా ఉంది. 1975 లో నేపాల్ లో అమెరికన్ మహిళ కొన్నీ జో బ్రోంచిజ్ ను హత్య చేసినందుకు గానూ 2003 నుంచి కాట్మండులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.. వయో భారం కారణంగా అతనిని జైలు నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన విషయం తెలిసిందే..