Homeట్రెండింగ్ న్యూస్400 Years House: 400 ఏళ్లు అయినా చెక్కుచెదరని ఇల్లు.. ఎలా ఉందో తెలుసా?

400 Years House: 400 ఏళ్లు అయినా చెక్కుచెదరని ఇల్లు.. ఎలా ఉందో తెలుసా?

400 Years House: 400 ఏళ్ల కట్టడం ఏది అంటే.. మనం చదువుకున్న పుస్తకాల ప్రకారం చార్మినార్‌ అంటాం. దాదాపు ఈ విషయం చదువుకున్న అందరికీ తెలుసు. కానీ, అంతటి సీనియారిటీ ఓ ఇల్లుకు ఉంది. నిర్మించి 400 ఏళ్లు అయినా.. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఠీవీ, రాజసం ఏమత్రం తగ్గలేదు. 30 అడుగుల ఎత్తులో కట్టిన ఈ ఇంటిని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.

ఐదు తరాలు చూసిన గృహం..
400 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు.. ఐదు తరాలవారు చూసిన ఇల్లు అది. రాజసం ఉట్టిపడుతున్న ఈ ఇంటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి యచూపుతున్నారు. ఇంతకీ ఈ ఇలు‍్ల ఎక్కడ ఉందో చెప్పలేదు కదూ.. రంగారెడ్డి జిల్లా మునుపల్లి గ్రామంలో ఈ పురాతనమైన ఇల్లు ఉంది. ఈ పురాతన ఇంటిని చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. జిల్లా వాసులు మునుపల్లి వైపు వెళ్తే తప్పకుండా ఆ ఇంటిని సందర్శిస్తారట. నాడు ఆ ఇంట్లో యజమానులతోపాట కూలీలు, పాలేర్లు, వారి కుటుంబ సభ్యులు కలిసే ఉండేవారని మునుపల్లి పెద్దలు చెబుతారు.

ప్రత్యేకత ఇదీ..
మునుపల్లిలోని 400 ఏళ్లనాటి ఇంటికి ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఇంట్లో 75 గదులు ఉన్నాయి. 101 ద్వారాలతో దీనిని నిర్మించారు. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఇంటిని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అప్పట్లో 200 మంది కూలీలు ఈ ఇంటి నిర్మాణం కోసం పనిచేసి ఉంటారని పురావస్తు శాఖ అంచనా వేసింది.

కూలీలకు పని కల్పించాలని..
సుమారు 17వ శతాబ్దంలో నాటి జమీందారు సంగప్ప పాటిల్‌ దీనిని నిర్మించారు. కరువుతో ఇక్కడి ప్రజలు అల్లాడుతున్న సమయంలో వారికి ఉపాధి కల్పించేందుకు ఈ ఇంటి నిర్మాణం చేపట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంత పెద్ద ఇంటిని తాము ఇంకెక్కడా చూడలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇంతటి పురాతనమైన ఇలు‍్ల తమ మునుపల్లిలో ఉండడం సంతోషంగా ఉందంటునా‍్నరు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper