Failed Heroes: సినిమాల్లో రాణించాలంటే పెట్టి పుట్టాలంటారు. పెట్టి పుట్టడమంటే తండ్రులు సినిమా స్టార్లు అయితే తమ కుమారులు ఈజీగా సినిమాల్లో కొనసాగించడమని అంటున్నారు. అలా చాలా మంది హీరోలు సినీ ఇండస్ట్రీలో అత్యున్నతస్థాయికి ఎదిగి తమ కుమారులను రంగంలోకి దించారు. వారు కూడా తండ్రుల పేరు చెప్పుకొని గుర్తింపు పొందారు. అయితే కొందరు తండ్రులు బిగ్ స్టార్లు అయినా తమ కుమారులు మాత్రం రాణించలేకపోయారు. కారణాలేవైనా అలాంటి వారు టాలీవుడ్లో చాలా మందే ఉన్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.
దాసరి నారాయణరావు-అరుణ్ కుమార్:
డైరెక్టర్ గా ఎన్నో సక్సెస్ సినిమాలు అందించి, నటుడుగానూ గుర్తింపు తెచ్చుకున్న దాసరి నారాయణ రావు గురించి తెలియని వారుండరు. దర్శకరత్న అనే బిరుదును కూడా సొంతం చేసుకున్న ఈయన తన కుమారుడు అరుణ్ కుమార్ ను సినిమాల్లోకి తెచ్చారు. ఎంతో మంది నటులను స్టార్లను చేసిన దాసరి నారాయణ రావు తన కొడుకును మాత్రం స్టార్ ను చేయలేకపోయారు.
ఎ కోదండరామిరెడ్డి -వైభవ్:
చిరంజీవి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ చేసిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి. చిరంజీవికే కాకుండా ఎంతో మంది ఆయన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే కోదండరామిరెడ్డి సినిమాలు తీయడం తగ్గించిన సమయంలో ఆయన కుమారుడు వైభవ్ ‘గొడవ’ అనే సినిమా ద్వారా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తెలుగులో వర్కౌట్ కాకపోవడంతో తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నాడు.
రవిరాజా పినిశెట్టి-ఆది పినిశెట్టి:
చంటి, పెదరాయుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన వెంకటేశ్, మోహన్ బాబులను ఓ రేంజ్ కు తీసుకెళ్లిన డైరెక్టర్ ఈయన. కానీ తన కొడుకు ఆది పినిశెట్టిని మాత్రం సక్సెస్ హీరోను చేయలేకపోయారు. ‘ఒక విచిత్రం’ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన ఆది ఆ తరువాత విలన్ పాత్రలు చేస్తున్నాడు.
ఇవీవీ సత్యనారాయణ-ఆర్యన్ రాజేశ్, నరేష్:
కామెడీ సినిమాలంటే ఇవివి సత్యనారాయణ పేరు గుర్తుకు వస్తుంది. ఎంతో మంది హీరోలకు మంచి సినిమాలు అందించిన ఆయన తన కుమారులను మాత్రం స్టార్లుగా తీర్చిదిద్దలేకపోయారు. ఆయన పెద్ద కొడుకు ఆర్యన్ రాజేశ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తున్నారు. చిన్న కొడుకు అల్లరి నరేష్ ఒకప్పుడు హిట్ సినిమాలు తీసినా ప్రస్తుతం ఆయన సినిమాలు యావరేజ్ గానే ఉంటున్నాయి.
ఎంఎస్ రాజు-సుమంత్ అశ్విన్ :
నిర్మాతగా వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా?లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఈయన తన కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా రాణించలేకపోతున్నారు. తూనీగ తూనీగ, లవర్స్ వంటి సినిమాల్లో అలరించినా స్టార్ గా మాత్రం ఎదగలేకపోయారు.
బ్రహ్మానందం-గౌతమ్:
కామెడీకి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే బ్రహ్మానందం అని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టరైజేషన్ తో కొన్ని సినిమాలు సక్సెస్ అయినవి ఉన్నాయి. కానీ ఆయన కుమారుడు గౌతమ్ ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇక ఆయన దారిలో పడ్డారని అనుకున్నాు. కానీ ఆ తరువాత గౌతమ్ కు అవకాశాలు రాలేదు. దీంతో ప్రస్తుతం ఆయన సినిమాల నుంచి తప్పుకున్నారు.
ఎంఎస్ నారాయణ-విక్రమ్:
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందంతో పోటీపడి కామెడీ పండించిన మరో నటుడు ఎంఎస్ నారాయణ. ఆయన కుమారుడు విక్రమ్ ను తన స్వీయ డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కానీ ఈ సినిమా యావరేజ్ గా నడిచినా ఆ తరువాత విక్రమ్ కు అవకాశాలు రాలేదు. దీంతో ఆయన సినిమాల నుంచి తప్పుకున్నాడు.