Airport Scam: విదేశాల్లోకి వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కొందరు ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి వెళ్తుంటారు..మరికొందరు చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తుంటారు. లేదా విదేశాల్లో బంధువులు ఉన్నట్లయితే వారిని చూసి రావడానికి వెళ్తుంటారు. అయితే అక్కడికి వెళ్లిన తరువాత ఆకర్షణీయమైన వస్తువు కనిపించగానే వెంటనే కొనుగోలు చేస్తుంటాం. మనదేశంలో దొరకని చాలా వస్తువులు విదేశాల్లో చూడగానే దానిని తీసుకొస్తుంటాం. ఈ సమయంలో అనుమతి లేని వస్తువులు కాకుండా పర్మిషన్ ఉన్నవాటిని తీసుకురావడమే మంచిది. ఇక ఇటీవల విదేశాల నుంచి తెచ్చుకునే వస్తువులపై ఎయిర్ పోర్టులో 18 శాతం కస్టమ్ డ్యూటీని విధిస్తున్నారు. ఇంతకీ కస్టమ్ డ్యూటీని ఎప్పుడు విధించాలి? ఎవరికి విధించకూడదు?
కస్టమ్ డ్యూటీ అనేది వస్తువుల రవాణాపై విధిస్తారు. వస్తువుల ఎగుమతి, దిగుమతిపై నిబంధనలకు అనుగుణంగా విధిస్తారు. మనదేశంలో కస్టమ్స్ చట్టం 1962 , కస్టమ్స్ టారిఫ్ చట్టం 1975 ప్రకారం అన్ని రకాల వస్తువులు ఎగుమతి, దిగుమతి చేసినప్పుడు పన్ను విధిస్తారు. ఇది 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉంటుంది. అలాగే బేసి కస్టమ్స్ డ్యూటీ, అదనపు కస్టమ్స్ డ్యూటీ, రక్షణ విధి, విద్య సెస్, యాంటీ డంపింగ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ అనే రకాలుగా విభజించారు.
అయితే విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ విధించే అధికారం ఎయిర్ వేస్ సిబ్బందికి ఉంది. కానీ ఇందుకు నిబంధనలు ఉన్నాయి. ఒక వ్యక్తి మూడు రోజుల కంటే తక్కువగా విదేశాల్లో గడిపినప్పుడు అతడు ఎలాంటి వస్తువును తీసుకొచ్చినా దానిపై పన్నును విధిస్తారు. ఇది 15 శాతం ఉండొచ్చు.. లేదా 18 శాతం ఉండొచ్చు. అయితే అదే వ్యక్తి మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు విదేశాల్లో ఉండి ఆ తరువాత స్వదేశానికి వచ్చినప్పుడు ఆ వస్తువుపై ఎలాంటి పన్ను విధించరాదని చట్టంలో పేర్కొనబడింది.
అందువల్ల విదేశాలకు వెళ్లి కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి.. ఆ తరువాత స్వదేశానికి వచ్చినప్పుడు ఎలాంటి వస్తువునైనా తీసుకొని రావొచ్చు. వీటిపై ఎలాంటి పన్ను ఉండదు. ఈ విషయాలు తెలియక చాలా మంది అదనంగా పన్నును చెల్లిస్తున్నారు. అయితే కొన్ని ఎయిర్ సంస్థలు మాత్రమే ఇలా వసూలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని కస్టమ్స్ చట్టం పేర్కొంటుంది.