spot_img
Homeఅంతర్జాతీయంRussian Luna 25 Mission: జాబిల్లి పైకి రష్యా.. మన చంద్రయాన్_3 పరిస్థితి ఏంటి?

Russian Luna 25 Mission: జాబిల్లి పైకి రష్యా.. మన చంద్రయాన్_3 పరిస్థితి ఏంటి?

Russian Luna 25 Mission: చంద్రయాన్_3 ప్రయోగం ద్వారా జాబిల్లి గుట్టుమట్లు తెలుసుకునేందుకు మార్గం సుగమం అవుతోందని ఇస్రో సంబరపడుతోంది. యావత్ జాతి మొత్తం చంద్రుడి కక్ష్యలో దిగిన చంద్రయాన్_3 అప్డేట్స్ ను తీసుకునేందుకు ఎప్పటికప్పుడు ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇన్ని సానుకూల అంశాల మధ్య అందాల జాబిల్లి మీద మనకంటే ముందుగానే రష్యా దిగింది. ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతున్నప్పటికీ.. ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. తన గగన తలం మీద నుంచి రాకెట్ ప్రయోగం చేపట్టింది. 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన “లూనా_25” ను విజయవంతంగా చంద్రుడి మీదికి పంపింది. భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువమే లక్ష్యంగా చంద్రయాన్_3 ని పంపితే.. రష్యా కూడా చంద్రుడి దక్షిణ ధ్రువాన్నే లక్ష్యంగా చేసుకుంది. దీనికోసం “లూనా_25” అనే స్పేస్ క్రాఫ్ట్ ను రష్యా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు “వాస్టోకీ కాస్మో డ్రామ్” అనే అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిపింది.

“వాస్టోకీ కాస్మో డ్రామ్” నుంచి నిప్పులు కక్కుతూ “లూనా_25” నింగిలోకి దూసుకెళ్లింది. ఇది కేవలం ఐదు రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం, చంద్రుడి దక్షిణ ధ్రువం పై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం కొన్ని రోజులపాటు (3 లేదా7) అన్వేషించిన అనంతరం చంద్రుడి మీద దిగుతుంది. అక్కడ దిగిన అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు రష్యా అంతరిక్ష కేంద్రానికి చేరవేరుస్తుంది. చంద్రుడి మీద నీటి ఆనవాళ్లు ఉన్నాయని ఇస్రో గతంలో ప్రపంచానికి వెల్లడించిన నేపథ్యంలో.. వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు పలు రాకెట్లను చంద్రుడి మీదికి పంపించాయి. అయితే ఆ ప్రయోగాల్లో ఆదేశాలు ఆశించినంత ప్రయోజనం కనిపించలేదు.

ఇక ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3 కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం పైనే ప్రధానంగా దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులను, మానవ నివాసానికి యోగ్యంగా ఉంటాయా? అనే విషయాలను ప్రధానంగా చంద్రయాన్_3 అధ్యయనం చేస్తుంది. ఒకవేళ విలువైన లోహాలు గనక ఉండి ఉంటే అవి ఉపయోగపడతాయా? అనే కోణంలో కూడా అది పరిశీలనలు జరుపుతుంది. కాగా రష్యా ప్రయోగించిన “లూనా_25” చంద్రయాన్_3 కంటే ముందుగానే ల్యాండింగ్ అవుతుండడం విశేషం. అయితే చంద్రయాన్_3 ద్వారా కనుగొన్న విషయాలను, లూనా_25 ద్వారా తెలుసుకున్న కొత్త విశేషాలను అటు ఇండియా, ఇటు రష్యా పరస్పరం బదిలీ చేసుకుంటాయా అనేది వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version