
Chanakya Niti: చాణిక్యుడు గొప్ప మార్గదర్శకుడు. ఆయన బోధనలు, సూచనలు నేటికీ అనుసరణీయమే. ఆచార్య చాణిక్యుడు తన వ్యూహాలతో చంద్రగుప్తుడిని రాజుగా చేశాడు. అర్థశాస్త్రం లాంటి మహాగ్రంధం రచించడం ద్వారా కౌటిల్యుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మనిషి జీవితం గురించి చెప్పిన ఎన్నో విషయాల సంకలనమే చాణిక్యనీతి గ్రంథం. ఒక వ్యక్తి సంతోషంగా ఎలా ఉండాలి, జీవితంలో విజయం ఎలా సాధించాలి, తలపెట్టిన పనిలో ఫలితం ఎలా పొందాలి, సంబంధాల్లో సంతోషంగా ఎలా ఉండాలో చెప్పాడు చాణిక్యుడు. ఆచార్య చాణిక్యుడు మహిళల గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఆచార్య చాణిక్యుడు ప్రకారం స్త్రీలు క్లిష్టమైన వారు. కొన్నిసార్లు వారు ఆలోచించేది, వారు చెప్పేది వేరువేరుగా ఉంటాయని చెప్పాడు చాణిక్యుడు. పురుషులతో పోలిస్తే మహిళలకు కొన్ని విషయాల్లో కోరికలు ఎక్కువ ఉంటాయని ఆచార్యుడు చెప్పారు. కానీ వాటి గురించి ఎప్పుడూ బయటకు చెప్పారని కూడా తెలిపాడు. చాణిక్యుడు వేటి గురించి అలా అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీనాం ద్విగుణ ఆహారో లజ్జ చాపి చతుర్గుణా l
సాహసం షడ్గుణం చైవ కామశ్చాష్టగుణః స్మృతః ll
ఈ శ్లోకంలో స్త్రీ యొక్క అనేక లక్షణాలను ఆచార్య కౌటిల్యుడు వివరించాడు. పురుషులకంటే స్త్రీలకు ఎక్కువ ఆకలి వేస్తుందని చాణిక్యుడు ఈ శ్లోకంలో చెప్పాడు. తెలివి నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు, కామం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని చాణిక్యుడు చెప్పుకొచ్చాడు.
ఆకలి ఎక్కువ..
పురుషులకంటే మహిళలకు ఆహారం ఎక్కువ అవసరం అవుతుందని, ఎందుకంటే వారు పురుషుల కంటే ఎక్కువ శారీరక శ్రమ చేయాల్సి ఉంటుందని చాణిక్యుడు చెప్పాడు. పురాతన కాలం నుంచి మహిళలు ఇంట్లో పనులన్నీ చక్కబెడుతూ వస్తున్నారు. నేటికీ ఆ ధోరణిలో పెద్దగా మార్పులేవీ లేవు. పురుషులు బయట పని చేస్తే.. మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు వంట పాత్రలు కడిగి పడుకునే వరకు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. పిల్లల ఆలనా, పాలనా, ఇంటి పనులు, వంట పనులు, ఇంటి పరిశుభ్రత, బట్టలు ఉతకడం, వంట చేయడం, వంట పాత్రలు కడగడం, అత్తమామలను చూసుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనుల్లో మహిళలు నిమగ్నమవుతారు.
అలాగే శరీరంలోనూ స్త్రీ వ్యవస్థ పురుషుల కంటే ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని చాణిక్యుడు చెప్పాడు. ఇంతగా శ్రమించే వారికి సాధారణంగా శక్తి కూడా ఎక్కువ కావాల్సి ఉంటుందని అందుకే ఆకలి ఎక్కువగా ఉంటుందని చాణిక్యుడు తెలిపారు.
ధైర్యం ఎక్కువ..
పురుషుల కంటే స్త్రీలకు ధైర్యం ఎక్కువ. చాలా విషయాల్లో వాళ్లు భయపడతారేమో. బొద్దింకను చూస్తూ అరవడం, చీకట్లో నడవడానికి భయపడడం, వీధి కుక్కలను చూసి పరిగెత్తడం ఇలాంటివి మహిళలు చేస్తారు కావచ్చు. కానీ వారికి ఇష్టమైన విషయంలో, కావాల్సిన అంశాల్లో, అవసరం అనుకున్నప్పుడు వారు దేనికి భయపడరు. మహిళలు మానసికంగా పురుషుల కంటే చాలా దృఢంగా ఉంటారు. మానసికంగా చాలా ధైర్యం చూపిస్తారు.

కోరిక ఎక్కువ..
స్త్రీ యొక్క లిబిడో పురుషులకు చాలా భిన్నంగా ఉంటుంది. శారీరక సంబంధం ముఖ్యం కాదు. భావోద్వేగ స్థితి కీలకం. శారీరక కోరిక విషయంలో పురుషులు చాలా త్వరగా ఉద్వేగానికి లోనవుతారు. అంతే త్వరగా చల్లబడిపోతారు. కానీ స్త్రీలు ఉద్వేగానికి రావడానికి సమయం తీసుకుంటారు. ఆ సంతృప్తిని ఎక్కువ సేపు ఆస్వాదిస్తారు. ఇది అర్థం కావాలంటే కామశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి.
