
Naresh – Pavitra Lokesh Marriage: విడాకులు రాకుండానే నరేష్ నాలుగో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో నరేష్ చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటాడా? ఒకవేళ నేరం నిరూపితమైతే ఆయన పరిస్థితి ఏంటి? అనే చర్చ మొదలైంది. మార్చి 10 ఉదయం నరేష్ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టారు. నటి పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్న వీడియో తో పాటు మీ ఆశీర్వాదాలు కావాలంటూ ట్వీట్ చేశారు.నరేష్ ప్రకటన క్షణాల్లో వైరల్ అయ్యింది. గత ఏడాది పెళ్లి ప్రకటన చేసిన నరేష్…చెప్పినట్లే పవిత్ర లోకేష్ ని జీవిత భాగస్వామి చేసుకున్నారన్న స్పష్టత వచ్చింది.
ఇదిలా ఉంటే మూడో భార్య రమ్య రఘుపతి నటి పవిత్ర లోకేష్ తో పెళ్లిని మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. నాకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకోవడం నేరం, అది చెల్లదంటున్నారు. నేను కొడుకు కోసం భర్తను కోరుకుంటున్నాను. నరేష్ కి విడాకులు ఇవ్వను, అలాగే పవిత్ర లోకేష్ తో పెళ్లి జరగనివ్వనని పట్టుబట్టారు. ఆమె చెప్పిన సమాచారం ప్రకారం… నరేష్ తో రాజీ చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించగా, నరేష్ మాత్రం విడాకుల పిటిషన్ వేశారు.
ఈ రెండు కేసుల్లో నరేష్ విచారణ ఎదుర్కొంటున్నారు. మరి సడన్ గా ఆయన పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు, పెళ్లి వీడియో కూడా అభిమానులతో పంచుకున్నారు. ప్రాధమికంగా విడాకుల చట్టం ప్రకారం జీవిత భాగస్వామి బ్రతికుండగా విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. ఐపీసీ 494 ప్రకారం నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే నరేష్ కి ఇవన్నీ తెలియనవి కావు. శిక్ష పడుతుందని తెలిసి మరో వివాహం చేసుకునే తెలివి తక్కువ వాడు కాదు.

రమ్య రఘుపతితో ఆయన విడిపోయి ఐదేళ్లు దాటిపోయింది. చట్టంలో ఏవో లొసుగులు వాడుకొని నాలుగో వివాహం చేసుకొని ఉండొచ్చు. లేదా రమ్య రఘుపతి-నరేష్ మధ్య ఒప్పందం కుదిరి ఉండవచ్చు. ఆమె విడాకులు ఇచ్చేందుకు అంగీకరించి ఉండవచ్చు. దీనిపై స్పష్టత రావాలంటే రమ్య రఘుపతి నోరు విప్పాలి. ఆమెకు తెలిసే ఈ వివాహం జరిగిందా? లేక తెలియకుండా నరేష్ తెగించారా? అని. ఒకవేళ రమ్య రఘుపతి మీడియా ముందుకు రాని పక్షంలో నరేష్ తో ఆమెకు ఒప్పందం కుదిరినట్లు భావించవచ్చు.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023
