శుభకార్యాలకు ఆటంకం కలగకూడదంటే ఈ వ్రతం చెయ్యండి!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మన ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వహిస్తున్నప్పుడు ఆ శుభకార్యంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా విజయవంతం కావాలని ఎన్నో పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. అయితే ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మొదటిగా ఆ వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు.ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజ్యుడు కావడంతో మొదటి పూజ వినాయకుడికి చేయడంవల్ల ఆ కార్యంలో ఉన్న విఘ్నాలను తొలగించి ఆ శుభకార్యం పూర్తి అవుతుందని ప్రగాఢ నమ్మకం. Also Read: దేశ ప్రజలకు శుభవార్త.. ఆ వ్యాక్సిన్ […]

Written By: Navya, Updated On : December 16, 2020 1:00 pm
Follow us on

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మన ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వహిస్తున్నప్పుడు ఆ శుభకార్యంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా విజయవంతం కావాలని ఎన్నో పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. అయితే ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మొదటిగా ఆ వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు.ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజ్యుడు కావడంతో మొదటి పూజ వినాయకుడికి చేయడంవల్ల ఆ కార్యంలో ఉన్న విఘ్నాలను తొలగించి ఆ శుభకార్యం పూర్తి అవుతుందని ప్రగాఢ నమ్మకం.

Also Read: దేశ ప్రజలకు శుభవార్త.. ఆ వ్యాక్సిన్ తో రెండేళ్లు ఇమ్యూనిటీ పవర్..?

మనిషి జీవితం ఒక సమస్యల వలయం అని చెప్పవచ్చు.మన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. అయితే ఇలాంటి సమస్యల నుంచి కొంత వరకు ఉపశమనం కలగాలంటే సంకష్టహర చతుర్దశి రోజు వినాయకుడికి పూజలు నిర్వహించడం ద్వారా కొంతవరకు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ సంకష్టహర చతుర్దశి ఎప్పుడు వస్తుంది? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: ‘ట్విట్టర్ కిల్లర్’కు మరణ శిక్ష

వినాయకుడికి ఎంతో ఇష్టమైన తిథి చవితి. సాధారణంగా చవితి ప్రతి నెలలో అమావాస్య తర్వాత ఒకటి, పౌర్ణమి తర్వాత మరొక చవితి వస్తుంది. అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అని అంటారు. అలాగే పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. ఈ వరద చతుర్థి వ్రతాన్ని కేవలం వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

సంకష్టహర చతుర్దశి ఎంతో ముఖ్యమైనది. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి అనుభవిస్తున్న ఈతిబాధలు, కుజ దోషాలు తొలగిపోతాయి. అయితే సంకష్టహర చతుర్దశి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని కూడా పిలుస్తారు. ఎక్కువ సమస్యలతో సతమతమయ్యేవారు ఈ సంకష్టహర వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం సంకష్టహర వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే మంచి ఫలితాలను పొందవచ్చుని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.