https://oktelugu.com/

బ్రేకింగ్: ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ అప్పటి నుంచే..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వేళ ఆ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. Also Read: చంద్రబాబు వద్దు.. జగన్ తోనే బీజేపీ ఫ్రెండ్ షిప్? ఈనెల 25 నుంచే ఏపీలో కోటిమందికి టీకా పంపిణీ చేస్తామని ట్విట్టర్ వేదికగా ఏపీలో కీలక ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2020 / 11:52 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వేళ ఆ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

    Also Read: చంద్రబాబు వద్దు.. జగన్ తోనే బీజేపీ ఫ్రెండ్ షిప్?

    ఈనెల 25 నుంచే ఏపీలో కోటిమందికి టీకా పంపిణీ చేస్తామని ట్విట్టర్ వేదికగా ఏపీలో కీలక ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.

    జగన్ సర్కార్ ఏపీ వ్యాప్తంగా 4,762 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అయితే టీకా ప్రపంచవ్యాప్తంగా ఒక్క ‘ఫైజర్’ది మాత్రమే రిలీజ్ అయ్యింది. దేశంలో భారత్ బయోటెక్ టీకా కూడా రెడీ అయినా ఇంకా కేంద్రం అనుమతి ఇవ్వలేదు.

    Also Read: జగన్, కేసీఆర్ దెబ్బ: హైకోర్టు సీజేలే మారిపోయారే? ఏంటి కథ?

    కానీ కేంద్రం ఇప్పటికే ఫలానా తేదికి వ్యాక్సిన్ వస్తుందని రాష్ట్రాలను అలెర్ట్ చేసినట్టు సమాచారం. అందుకే రాష్ట్రాలన్నీ డిసెంబర్ 25 నుంచి వ్యాక్సిన్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నట్టు సమాచారం.

    ఏపీ ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు టీకా ఇస్తుందా? లేక ఎంతైనా రేట్ పెడుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఫైజర్ టీకా ధరను రూ.2500గా నిర్ణయించారు. సీరిమ్ టీకా రూ.250గా పేర్కొన్నారు. మరి ఏ టీకా ప్రజలకు ఇస్తారన్నది వేచిచూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్