
Vakeel Saab -2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన సినిమా ‘వకీల్ సాబ్’. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయం లో, అసలు ఇంట్లో నుండి అడుగు తీసి కాలు బయటకి పెట్టడానికి వణికిపోతున్న రోజుల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ సినిమా విడుదల సమయం లో ఓవర్సీస్ మార్కెట్ లో సీటింగ్ కెపాసిటీ 30 శాతం కి తగ్గించారు. కర్ణాటక మరియుఈ చెన్నై వంటి ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి. ఆడియన్స్ సినిమాలను చూసే మూడ్ లో లేని సమయం అది. అక్కడి మార్కెట్ సరిగ్గా ఉండుంటే ఈ చిత్రం అప్పట్లోనే వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని కొల్లగొట్టేదని ట్రేడ్ పండితులు సైతం చెప్పిన మాట.

కానీ బ్యాడ్ లక్, రెండు వారాల లోపే థియేటర్స్ అన్నీ లాక్ డౌన్ కారణంగా మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దాంతో క్లోసింగ్ కలెక్షన్స్ కేవలం 90 కోట్ల రూపాయిల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా విడుదలై నిన్నటితో రెండేళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ లో గ్రాండ్ గా ఒక స్పేస్ ని కండక్ట్ చేసారు. ఈ స్పేస్ కి ఆ చిత్ర డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా హాజరయ్యాడు.
ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ‘వకీల్ సాబ్ 2 ‘ స్క్రిప్ట్ మీద పని చేస్తున్నానని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. ఇదే కనుక జరిగితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఒక్కటి కూడా మిగలదని, రాజమౌళి రికార్డ్స్ సైతం బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు వెలువడే అవకాశం ఉంది.