Ravanasura Collections: డివైడ్ టాక్ తో దుమ్ము లేపుతున్న ‘రావణాసుర’.. కానీ బ్రేక్ ఈవెన్ కి ఇంకా దూరం లో ఉందో తెలుసా..?

Ravanasura Collections: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రావణాసుర’ రీసెంట్ గా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. హీరో నెగటివ్ రోల్ అవ్వడం తో తొలుత ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ ఓపెనింగ్స్ దంచి కొట్టేసింది,అసలు ఎలాంటి హైప్ లేకుండా వచ్చి మొదటి రోజు ఈ చిత్రం నాలుగు కోట్ల 25 లక్షల రూపాయిలు కేవలం తెలుగు […]

Written By: Vicky, Updated On : April 10, 2023 7:47 am
Follow us on

Ravanasura Collections

Ravanasura Collections: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రావణాసుర’ రీసెంట్ గా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. హీరో నెగటివ్ రోల్ అవ్వడం తో తొలుత ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ ఓపెనింగ్స్ దంచి కొట్టేసింది,అసలు ఎలాంటి హైప్ లేకుండా వచ్చి మొదటి రోజు ఈ చిత్రం నాలుగు కోట్ల 25 లక్షల రూపాయిలు కేవలం తెలుగు స్టేట్స్ నుండే వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ కూడా కలిపి 5 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. కానీ రెండవ రోజు మాత్రం మొదటి రోజు తో పోలిస్తే 50 శాతం వసూళ్లు తగ్గాయి. అయ్యినప్పటికీ కూడా ఆ జానర్ సినిమాకి రెండు రోజుల్లో 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ అంటే చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాకా వెళ్లడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది. దీనితో పబ్లిసిటీ ఖర్చు మరియు ప్రింటు ఖర్చులను కూడా కలిపితే 24 కోట్ల రూపాయిలు అవుతుంది.బ్రేక్ ఈవెన్ అయ్యి, ఈ సినిమాని కొన్న ప్రతీ బయ్యర్ సేఫ్ అవ్వాలంటే కచ్చితంగా పాతిక కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సిన అవసరం ఉంది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా మూడు రోజుల్లో పది కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.బ్రేక్ ఈవెన్ కి మరో 15 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే అది దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు.

Ravanasura Collections

వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ మొత్తం డ్రాప్ అయ్యిపోతాయని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి ఉన్న ఏకైక ఆశ ఏదైనా ఉందా అంటే అది కేవలం సమ్మర్ సీజన్ మాత్రమే..సమ్మర్ సీజన్ లో లాంగ్ రన్ లు చాలా బాగుంటాయి, పైగా పెద్ద హీరోలెవరు ఈ సమ్మర్ లో రావడం లేదు కాబట్టి ,బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో అంటున్నారు. చూడాలి మరి.