Don Love story : ఒక డాన్, ఒక హీరోయిన్ వీర ప్రేమ గాథ.. రొమాంటిక్ క్రైమ్ సినిమాకి తక్కువేం కాదు

Jacqueline Fernandez & Sukesh Chandrashekhar : రొమాంటిక్ క్రైమ్ డ్రామాలను ఇదివరకు మనం సినిమాల్లోనే చూసాం. నిజజీవితం లో ఇలాంటివి చాలానే ఉంటాయి. కానీ మన దృష్టిలోకి అవి రావడం చాలా తక్కువ. తాజాగా మనీ లాండరింగ్ కేసు లో జైలుకెళ్లినా సుఖేష్ చంద్ర శేఖర్ మరియు జాక్విలిన్ ఫెర్నాండేజ్ ప్రేమకథ కూడా ఇలాంటిదే.సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులతో కూడిన ప్రేమకథని మనం చూసి ఉండము. ఈ ప్రేమకథ  డబ్బులతోనే మొదలైంది. ఆర్థిక నేరగాడు అయిన సుఖేష్ […]

Written By: NARESH, Updated On : April 9, 2023 9:13 pm
Follow us on

Jacqueline Fernandez & Sukesh Chandrashekhar : రొమాంటిక్ క్రైమ్ డ్రామాలను ఇదివరకు మనం సినిమాల్లోనే చూసాం. నిజజీవితం లో ఇలాంటివి చాలానే ఉంటాయి. కానీ మన దృష్టిలోకి అవి రావడం చాలా తక్కువ. తాజాగా మనీ లాండరింగ్ కేసు లో జైలుకెళ్లినా సుఖేష్ చంద్ర శేఖర్ మరియు జాక్విలిన్ ఫెర్నాండేజ్ ప్రేమకథ కూడా ఇలాంటిదే.సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులతో కూడిన ప్రేమకథని మనం చూసి ఉండము. ఈ ప్రేమకథ  డబ్బులతోనే మొదలైంది. ఆర్థిక నేరగాడు అయిన సుఖేష్ చంద్ర శేఖర్ సినిమాల్లో హీరోయిన్ గా వెలుగొందుతున్న జాక్విలిన్ ఫెర్నాండేజ్ ని చూసి మనసు పడ్డాడు.మనోడి నెట్వర్క్ చాలా పెద్దది కదా, ఆమె ఫోన్ నెంబర్ కనుక్కొని ఆమెకి ఫోన్లు చెయ్యడం, మెసేజిలు చెయ్యడం ప్రారంభించాడు. మొదట్లో ఫెర్నాండేజ్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మనోడు ఊరుకోదు కదా,ఫెర్నాండేజ్ హెయిర్ స్టైలిస్ట్ ని పట్టుకొని ఆమెకు డబ్బులు, బంగార నగలు ఇచ్చి మరీ జాక్వెలిన్ ని కలిసాడు.ఆమెని కలిసిన వెంటనే ‘నేను సన్ నెట్వర్క్స్ మరియు మలబార్ జ్యువలరీస్ అధినేతని’ అని తనని తాను పరిచయం చేసుకున్నాడు.

అంతే కాదు తనకి హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా బాగా క్లోజ్ అని చెప్పుకున్నాడు. అలా వీళిద్దరి పరిచయం మొదలైంది.ప్రతీ రోజు మెసేజిలు, ఫోన్ కాల్స్  వగారా వంటివి చేసుకొని ఇద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేని రేంజ్ లో దగ్గరయ్యారు,ప్రేమించుకున్నారు. డేటింగ్ కూడా చేసారు. కోట్ల విలువైన ఆస్తులు, నగదు, బంగారం ఇచ్చి జాక్వెలిన్ ను సుఖపెట్టాడు.  ఇంతలోపే మనోడు చేసిన స్కామ్స్ అన్నీ బయటపడి మీడియాలో పెద్ద రచ్చ అయ్యింది. ఇదంతా తెలుసుకొని జాక్విలిన్ ఫెర్నాండేజ్ షాక్ కి గురైంది. సుఖేష్ తో ఈమె నడిపిన ప్రేమవ్యవహారాలు తెలుసుకొని ఈడీ అధికారులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని విచారించారు.అప్పుడు ఆమె వాళ్లకి చెప్పిన సమాధానాలు వింటే షాక్ అవ్వాల్సిందే.అసలు సుఖేష్ ఇంత పెద్ద స్కామ్స్ చేసాడని నాకు తెలియదని.అతను తనకి పంపిన మెసేజీలు, డబ్బు, నగదు అంతా పారిశ్రామికవేత్త అని తీసుకున్నానని ఆమె తెలిపింది.  నేను అతనిని చెన్నై లో కేవలం రెండు సార్లు మాత్రమే కలిశానని, అతనిని ఎప్పుడు కలుద్దాం అన్నా కలిసేవాడు కాదని ఈడీ అధికారులకు చెప్పుకొచ్చింది.

నేను వీడియో కాల్స్ చేసినప్పుడల్లా అతను ఒక ఆఫీస్ కనిపించేదని, అలా నమ్మించాడని చెప్పుకొచ్చింది.. అప్పట్లో ఎప్పుడు కలుద్దాం అని అడిగిన నేను పలానా చోట చిక్కుకున్నానని, లాక్ డౌన్ వల్ల కలవలేకపోతున్నాని చెప్పుకొచ్చింది.అతను జైలుపాలై పెరోల్ మీద బయటకి వచ్చాడని విషయమే నాకు తెలియదని చెప్పింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇదంతా ఏమిటి అని నేను చంద్ర శేఖర్ ని అడిగినప్పుడు, అవన్నీ అసత్య ఆరోపణల ద్వారా వేసిన కేసులు అని, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కి ఇవన్నీ కామన్ అని చెప్పాడంటూ చెప్పుకొచ్చింది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.ప్రస్తుతం ఆమె అతనితో ఇంకా రిలేషన్ మెయింటైన్ చేస్తుందో లేదో తెలియదు కానీ, సుఖేష్ మాత్రం జైలులో ఉ:డే ఆమెని తల్చుకుంటూ  ఎమోషనల్ గా లేఖలు రాస్తూనే ఉన్నాడు.

ఇటీవలే ఆయన తన ముద్దుల ప్రేయసి జాక్విలిన్ ఫెర్నాండేజ్ కి ఈస్టర్ సందర్భంగా సుఖేష్ రాసిన ప్రేమ సందేశం ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతోంది.. ఆ లేఖలో  ‘బేబీ..నీకు ఈస్టర్ శుభాకాంక్షలు.నాకు తెలుసు నీకు పండుగ అంటే ఎంత ఇష్టం అనేది,ఈస్టర్ ఎగ్స్ అంటే కూడా ఎంత ఇష్టమో నాకు తెలుసు, అవన్నీ నేను ఈరోజు నీతో మిస్ అవుతున్నాను.ఈస్టర్ ఎగ్స్ ని పగలగొట్టి అందులో క్యాండీ కలుపుతున్న సమయంలో నీలో నాకు చిన్న పిల్ల కనిపించేది, నేడు అవన్నీ నేను మిస్ అవుతున్నాను’ అంటూ బావోద్వేగంగా సుఖేష్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంకా సుఖేష్ లేఖలో పలు పర్సనల్ విషయాలు పేర్కొన్నాడు. ‘బేబీ..నువ్వు ఎంత అద్భుతమైన స్త్రీ అనేది నీకు కూడా తెలియనంత నాకు తెలుసు, ఈ ప్రపంచంలో నీకు మించిన అందమైన స్త్రీ లేదు. ఐ లవ్ యూ..రాబొయో రోజుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నువ్వే నా ప్రేయసివి. నేను నిన్ను ఎంత మిస్ అవుతున్నానో, నువ్వు కూడా నన్ను అంతే మిస్ అవుతున్నావు అనే విషయం నాకు తెలుసు, రాబోయే రోజుల్లో మనకి అంతా మంచి జరుగుతుందని ఈ ఈస్టర్ సందర్భంగా నేను నమ్ముతున్నాను. వచ్చే ఏడాది నీతో కలిసి కనీవినీ ఎరుగని రీతిలో ఈస్టర్ జరుపుకుంటాను. నీకు మరియు మీ అమ్మా నాన్నలకు ఈ మరోసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అంటూ సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ చూసి నెటిజెన్స్ కూడా  వీరి మధ్యన గాఢమైన బంధం ఉందని కామెంట్ చేస్తున్నారు. .

ఇలాంటి పోస్టులు పెట్టడం సుఖేష్ కు కొత్తేమీ కాదు, ఆయన జాక్వెలిన్ మీద చాలా ఎమోషనల్ పోస్ట్స్ పెట్టాడు.ఇది ఆయన పట్ల సానుభూతిని  పెంచుతోంది.రొమాంటిక్ క్రైమ్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తున్న వీళ్లిద్దరి ప్రేమకథ చివరికి ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.