https://oktelugu.com/

అదృష్టవంతులు.. రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు దొరికాయ్!

మనం చాలా సందర్భాల్లో ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయి అనే సామెతను వింటూ ఉంటాం. అదృష్టం తలుపుతడితే కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు సైతం ధనవంతులు కావడానికి ఎంతో సమయం పట్టదు. తాజాగా ఆస్ట్రేలియాలోని బావ బావమరిదిలను అదే విధంగా అదృష్టం వరించింది. ఊహించని విధంగా వరించిన అదృష్టాన్ని చూసి వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. Also  Read : మాస్కు పెట్టుకోకుంటే కరోనా ఇలా సోకుతుంది! దక్షిణ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని తరగుల్లా ప్రాంతాల్లో పసిడి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 22, 2020 / 10:34 AM IST
    Follow us on

    మనం చాలా సందర్భాల్లో ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయి అనే సామెతను వింటూ ఉంటాం. అదృష్టం తలుపుతడితే కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు సైతం ధనవంతులు కావడానికి ఎంతో సమయం పట్టదు. తాజాగా ఆస్ట్రేలియాలోని బావ బావమరిదిలను అదే విధంగా అదృష్టం వరించింది. ఊహించని విధంగా వరించిన అదృష్టాన్ని చూసి వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

    Also  Read : మాస్కు పెట్టుకోకుంటే కరోనా ఇలా సోకుతుంది!

    దక్షిణ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని తరగుల్లా ప్రాంతాల్లో పసిడి దొరుకుతుంది. అయితే చిన్నచిన్న ముక్కలుగా ఆ ప్రాంతంలో బంగారం ముక్కలు లభిస్తాయి. బ్రెంట్ షాన్నొన్, ఇథన్ వెస్ట్ అనే బావాబావమరిదులు కొన్ని రోజుల క్రితం బంగారం కోసం వెళ్లారు. అలా వెళ్లిన వాళ్లకు 2.5 లక్షల అమెరికన్ డాలర్ల విలువైన 3.5 కిలోల బరువైన బంగారం ముద్దలు దొరికాయి. భారత కరెన్సీ ప్రకారం ఈ బంగారం ముద్దల విలువ కోటీ 80 లక్షల రూపాయలు

    మెటర్ డికెటర్ సహాయంతో బంగారం నిల్వల కోసం గతంలో ఎవరూ వెళ్లని ప్రాంతాలకు వెళ్లి వీళ్లు పసిడి ముద్దలను కనిపెట్టారు. అంచనా వేసిన దాని కంటే ఎక్కువ మొత్తం రావచ్చని వీళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇథన్ వెస్ట్ నాలుగేళ్లుగా బంగారం అన్వేషణలో నిమగ్నమై చిన్నచిన్న బంగారం ముక్కలను సేకరించాడు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా భారీ మొతంలో బంగారం సొంతం కావడంతో ఎంతో సంతోషిస్తున్నాడు.

    ఏడేళ్ల క్రితం ఈ ప్రాంతానికి సమీపంలో ఒక వ్యక్తికి ఐదున్నర కిలోల బంగారం దొరికింది. 1851 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో బంగారం లభ్యమవుతోందని స్థానికులు చెబుతున్నారు. గతంలో కళ్ల ద్వారా బంగారం కోసం వెతికితే ఇప్పుడు మెటల్ డిటెక్టర్ల సహాయంలో బంగారం కనిపెడుతున్నారు.

    Also Read : బిగ్ స్కామ్: 18 నెలల్లో 8మందికి జన్మనిచ్చిన 65 ఏళ్ల మహిళ!