తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఎప్పటినుండో?

కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో లాక్‌ డౌన్ తదితర పరిణామాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం అన్‌ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. వాటిని తిరిగి ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరగాల్సిన భేటీ… వాయిదా పడింది. సర్వీసుల పునరుద్ధరణ విషయమై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు జూన్‌ లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో […]

Written By: Neelambaram, Updated On : August 22, 2020 11:50 am
Follow us on

కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో లాక్‌ డౌన్ తదితర పరిణామాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం అన్‌ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. వాటిని తిరిగి ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరగాల్సిన భేటీ… వాయిదా పడింది. సర్వీసుల పునరుద్ధరణ విషయమై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు జూన్‌ లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలంగాణకు 256 బస్సు సర్వీసులను తిప్పుతామని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది.

Also Read : విషాదం.. చనిపోతూ తోటి సిబ్బంది ప్రాణాలు కాపాడారు?

ఈ క్రమంలో… హైదరాబాద్‌ లో మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే… హైదరాబాద్‌ లోని బస్ భవన్‌ లో కరోనా కేసులు నమోదు కావడం, ఇతరత్రా పలు అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. కాగా… అన్‌ లాక్ 3.0 ఆగష్టు 30 తో పూర్తి కానున్న నేపధ్యంలో… వచ్చే వారం టీఎస్ఆర్టీసీ అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీ నుంచి తెలంగాణకు ఎన్ని బస్సు సర్వీసులు తిప్పాలి ? అలాగే తెలంగాణ నుంచి ఏపీకి ఎన్ని సర్వీసులు తిప్పాలన్న విషయాలను చర్చించి అధికారులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ సమావేశం తరచూ వాయిదా పడుతుండడంతోపాటు, అసలు సమావేశం ఎప్పుడు జరుగుతుందే విషయమై ఇరు రాష్ట్రాల అధికారుల్లోనూ స్పష్టత లేకుండా పోయింది. అంతేకాదు… ఈ ప్రశ్నకు సమాధానం కూడా దొరకడంలేదు.

Also Read : వారంతా అయిపోయారు ఇప్పుడు వీళ్ళొచ్చారు..! ఎవరి తలరాత మార్చడానికి?