https://oktelugu.com/

Pani Puri: చాట్ అంటే పానీ పూరీ మాత్రమే కాదు.. అందులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?

పెలుసయిన పూరీలను ముక్కలు ముక్కలుగా చేసి.. అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంపల మిశ్రమం, కొన్ని రకాల చట్నీలను కలిపి దీనిని తయారు చేస్తారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 27, 2024 / 02:20 PM IST
    Follow us on

    Pani Puri: పానీ పూరి.. ఆ పేరు వింటే చాలు నోటిలో లాలాజలం అలా ఊరిపోతూ ఉంటుంది. దానిని తినేందుకు ఎంతసేపైనా ఎదురు చూడాలి అనిపిస్తుంది. ఆ పూరికి కొంచెం రంధ్రం పెట్టి.. అందులో కొంత బంగాళదుంపల మిశ్రమం వేసి, చింతపండు రసం పోసి అలా నోట్లో వేసుకుంటే.. స్వర్గం సెంటీమీటర్ దూరంలో కనిపిస్తుంది. అందుకే మన దేశంలో పానీ పూరిని జనాలు బాగా ఇష్టపడతారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు పానీ పూరి వ్యాపారం లోకి వచ్చాయి అంటే దీనికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. ముంబై లాంటి ప్రాంతాల్లో అనేక రకాలైన పానీపూరిలు లభ్యమవుతాయి. ఉత్తరాది వంటకం గా పేరొందిన ఈ పానీపూరిలో ఎన్నో రకాలు ఉన్నాయి.

    పానీ పూరి గోల్గప్ప

    పానీ పూరి లో ఒక రకం. ముంబై ప్రాంతంలో ఎక్కువగా తింటూ ఉంటారు.. విదేశీయులు కూడా దీనిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇందులో చింతపండుతో తయారుచేసిన చట్ని, బంగాళదుంపలు, కొన్ని మసాలా దినుసులు, ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలతో తయారుచేస్తారు.. ఇలా తయారుచేసిన చాట్ ను పెలుసైన పూరిలో రంధ్రం చేసి అందులో వేస్తారు. చింతపండు చట్నీ అంచుకు పెట్టుకోవడానికి ఇస్తారు. చాట్ లో స్పైసీ నెస్ ను కోరుకునే వారు దీనిని ఎక్కువగా తింటుంటారు.

    భేల్ పూరి

    టమాటాలు, ఉడికించిన బంగాళదుంపలు, మరమరాలు, చిప్స్, కొన్ని రకాల మసాలాలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. దీంతోపాటు స్పైసీ గ్రీన్ చట్నీ సర్వ్ చేస్తారు. కొన్నిచోట్ల చికెన్ ఫ్రైడ్ ముక్కలు కూడా దీనికి యాడ్ చేస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో దీనిని ఎక్కువగా తింటూ ఉంటారు.

    సేవ్ పూరి

    పెలుసయిన పూరీలను ముక్కలు ముక్కలుగా చేసి.. అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంపల మిశ్రమం, కొన్ని రకాల చట్నీలను కలిపి దీనిని తయారు చేస్తారు. దానిపైన వేయించిన సేమియాలను వేస్తారు. దీంతోపాటు పుదీనా చట్నీని సర్వ్ చేస్తారు.. వర్షాకాలంలో ఈ చాట్ కు డిమాండ్ ఉంటుంది.

    ఆలూ టిక్కి చాట్

    ఉడికించి వేయించిన బంగాళదుంప ముక్కలకు పెరుగు, చింతపండు చట్నీ, పుదీనా చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, సేమియా మిశ్రమాలతో దీన్ని తయారు చేస్తారు. దీని రుచి చాలా బాగుంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో దీనిని తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

    దహీ పూరి

    పానీ పూరి మాదిరిగానే దహిపురిలో పెరుగు, చింతపండు చట్నీ, కొన్ని రకాల మసాలా దినుసులు, కొన్ని రకాల మొలకల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఈ చాట్ ను ఉత్తరాది వాళ్లు ఎక్కువగా తింటూ ఉంటారు. ముఖ్యంగా దీనిని వేసవికాలంలో ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.

    రగడ పట్టీస్

    ఇందులో రకరకాల చట్నీలు, ఉడికించిన పచ్చి బఠాణీలు, ఉల్లిపాయ ముక్కలు, సుగంధ ద్రవ్యాలు, బంగాళదుంప ముక్కలు వేసి చేస్తారు. ఈ చాట్ లో బంగాళా దుంపల మొక్కలను పట్టిస్ అని పిలుస్తారు. పచ్చి బఠాణీలతో తయారు చేసే వంటకాన్ని రగడ అంటారు. దీనిపైన కొంచెం సేమియాతో అలంకరించి సర్వ్ చేస్తారు.

    చోలే టిక్కీ

    ఉడిగించిన బంగాళదుంపలు, పెరుగు, చింతపండు చట్నీ, చోలేలతో ఉడికించి తినండి తయారు చేస్తారు. పచ్చి టమాటా ముక్కలతో పైన గార్నిష్ చేస్తారు. సెవ్ లతో అలంకరించి సర్వ్ చేస్తారు.

    సమోసా చాట్

    ఈ చాట్ చాలా ప్రాశస్త్యం పొందింది. ముందుగా తయారు చేసిన సమోసాలను నలగొట్టి.. అందులో పెరుగు, పచ్చి చింత పండు చట్నీ, పుదీనా చట్నీ, జరిగిన ఉల్లిపాయలు, టమాట ముక్కలు, సెవ్ లు వేసి తయారు చేస్తారు. అనంతరం పుదీనా చట్నీతో దానిని సర్వ్ చేస్తారు.

    కచోరీ చాట్

    స్పైసీ చిక్ పీస్, పెరుగు, చింతపండు చట్నీ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, కొత్తిమీర మిశ్రమంతో దీనిని తయారు చేస్తారు. ఇందులో స్వీట్ కచోరీ ఉత్తరాది ప్రాంతంలో ప్రముఖ వంటకంగా ప్రాశస్త్యం పొందింది. స్వీట్ నచ్చని వారు స్పైసీ కచోరీ తింటారు.

    దహీ భల్లా

    చిక్కటి పెరుగులో చింతపండు చట్నీ, పుదీనా చట్నీ, జీలకర్ర, మసాలాలు వేసి కలియబెడతారు. అది పులిసిపోయిన తర్వాత.. వేడివేడి మినప వడలను అందులో వేస్తారు. కొద్ది గంటలసేపు అందులో నానిన తర్వాత.. కొంచెం సెవ్ వేసి సర్వ్ చేస్తారు. ఎండాకాలంలో శరీరానికి చలువ చేసేందుకు దీనిని ఎక్కువగా తింటూ ఉంటారు.