https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి కి డూప్ గా నటించే నటుడు ఎవరో తెలుసా..? ఒక సినిమాకి ఆయనకి ఎంతిస్తారో తెలుసా..?

ఇండస్ట్రీ లో ఎంత పెద్ద స్టార్ హీరో అయిన కూడా కొన్ని సీన్లలో డూప్ లను వాడాల్సి వస్తుంది. ఎందుకంటే రిస్కీ షాట్స్ చేసినప్పుడు డూప్ లేకుండా హీరోలు స్వయంగా నటిస్తే వాళ్ళకి ఏదైనా ఇంజురీ జరగొచ్చు.

Written By:
  • Gopi
  • , Updated On : February 27, 2024 / 02:23 PM IST
    Follow us on

    Chiranjeevi: సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మహా సముద్రం లాంటిది. కాబట్టి ఇండస్ట్రీ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం తేడా వచ్చిన కూడా సముద్రం లో ప్రయాణం చేసేటపుడు ఎలా అయితే మునిగిపోతారో, ఇండస్ట్రీలో కూడా అలాంటి పరిణామాలే ఎదురవుతాయి.. అందుకే ఇండస్ట్రీ లో ప్రతి ఒక్కరూ సినిమా కెరియర్ పరంగా అయిన, పర్సనల్ లైఫ్ లో అయిన చాలా జాగ్రత్త గా వ్యవహరిస్తూ ముందుకు కదులుతారు…

    ఇక ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీ లో ఎంత పెద్ద స్టార్ హీరో అయిన కూడా కొన్ని సీన్లలో డూప్ లను వాడాల్సి వస్తుంది. ఎందుకంటే రిస్కీ షాట్స్ చేసినప్పుడు డూప్ లేకుండా హీరోలు స్వయంగా నటిస్తే వాళ్ళకి ఏదైనా ఇంజురీ జరగొచ్చు. ఒకవేళ అలా కనక జరిగినట్టయితే సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఒక ప్రొడ్యూసర్, ఆర్టిస్టులు అందరూ తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి హీరో అనేవాడు సినిమాకి చాలా ముఖ్యం. అందుకే వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవడానికి హీరోలు ఈ డూపులను వాడుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) లాంటి నటుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.

    ఇక ఈయన కూడా తన సినిమాలోని కొన్ని సీన్లకు ఒక డూప్ ని వాడుతూ ఉంటాడు. ఆయన పేరు ప్రేమ్ కుమార్ 30 సంవత్సరాల నుంచి చిరంజీవికి డూప్ గా నటిస్తూ వస్తున్నాడు. ఇక ఈయన గోదావరి ప్రాంతానికి చెందినవాడు. ఈయనకి సపరేట్ గా ప్రేమ్ కుమార్ రికార్డింగ్ స్టూడియో అనే ఒక స్టూడియో కూడా ఉంది. దీని ద్వారా రికార్డింగ్ డాన్స్ లను ఏర్పాటు చేస్తూ దాని మీద వచ్చే ఆదాయంతో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.

    ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి సినిమా షూటింగ్ ఎప్పుడున్న ఆయన డూప్ గా నటిస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ఇక మొత్తానికైతే ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా తనే చిరంజీవికి డూప్ గా నటిస్తూ వస్తున్నాడు. డూప్ గా నటించినందుకు గాను ఆయనకి సినిమా మొత్తానికి కలిపి 15 లక్షల వరకు డబ్బులు ఇస్తారట… ఇక మొత్తానికి అయితే చాలా సంవత్సరాల నుంచి ప్రేమ్ కుమార్ చాలా సినిమాల్లో చిరంజీవికి డూప్ గా నటించి మెప్పిస్తున్నాడు…