Miss World 2024: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఈ విషయాలు తెలిసా?

ఆమె అందానికి ఫిదా అవడం మాత్రమే కాదు ఆమె గురించిన వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె సేవా గుణం చాలా గొప్పది. అయితే క్రిస్టినా పిస్కో ఫౌండేషన్ ను స్థాపించి అందరి చేత షభాష్ అనిపించుకుంది.

Written By: Swathi, Updated On : March 11, 2024 12:36 pm

Miss World 2024

Follow us on

Miss World 2024: మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి అంటే ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఆ కిరీటం ఎవరికి దక్కుతుంది అనే ఆత్రుత అందరిలోనూ ఉంటుంది. మరి ఈ సారి 71వ మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎవరు సొంతం చేసుకున్నారు అనుకుంటున్నారా? అయితే ఈసారి క్రిస్టినా ఆ కిరీటాన్ని సొంతం చేసుకొని మిస్ వరల్డ్ గా మారింది. మరి ఈమె గురించి మీకోసం కొన్ని వివరాలు..

ఆమె అందానికి ఫిదా అవడం మాత్రమే కాదు ఆమె గురించిన వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె సేవా గుణం చాలా గొప్పది. అయితే క్రిస్టినా పిస్కో ఫౌండేషన్ ను స్థాపించి అందరి చేత షభాష్ అనిపించుకుంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి సేవలు అందించింది. ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఆర్థికంగా వెనకబడిన చిన్నారులకు చదువు దూరం కాకూడదు అని క్రిస్టినా టాంజానియాలో ఓ స్కూల్ ను కూడా స్థాపించిందట. ఈ పాఠశాల ద్వారా ఎంతో మందికి విద్యను అందిస్తుంది.

ఈమె మాట్లాడుతూ..తన జీవితం మొత్తంలో గర్వించదగ్గ విషయం స్కూల్ ను ప్రారంభించడం అని చెప్పి తన మంచి మనుసును చాటుకుంది. ఇక ఫౌండేషన్ ను స్థాపించి స్వచ్ఛంద సేవకురాలిగా కూడా పనిచేస్తోంది. 2022లో లండన్ లోని ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్ లో చేరింది. అక్కడ మెలుకువలు నేర్చుకున్న క్రిస్టినా అదే సంవత్సరం నిర్వహించిన మిస్ చెక్ రిపబ్లిక్ పోటీలో పాల్గొని విజయం సాధించడం గమనార్హం. ఈమెకు మోడలింగ్ అంటే ఇష్టంతో లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ను పూర్తి చేసినా.. అడుగులు మాత్రం మోడలింగ్ వైపే పడ్డాయి.

ఇక బాలల ఉన్నతికి శ్రమిస్తూనే ఉంటాను అని.. ఈ అందాల పోటీలో గెలిచినా గెలవకపోయినా తన శ్రమ మాత్రం ఆగదు అని పేర్కొంది క్రిస్టినా.. ఈ మాటలకు అక్కడి ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. ఇక 24 సంవత్సరాల ఈ యువతి ఇంగ్లీష్, పోలిష్, స్లోవక్, జర్మన్ భాషలను అనర్గళంగా మాట్లాడుతుందట. ఫ్లూట్ ప్లే చేయడంలో కూడా మంచి నిపుణురాలట.. కానీ మొత్తం మీద అందం మాత్రమే కాదు ఈమె మనుసు కూడా బంగారమే..