Rangasthalam: ‘రంగస్థలం’ లో ఆది పక్కన నటించిన అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అని తెలుసా?

Rangasthalam: కొన్ని విషయాలను సినిమాల ద్వారానే తెలుసుకుంటాం. పురాతన కాలంలో ఈ భూమ్మీద ఏమేం జరిగేవో ఒకప్పుడు తాతలు మాత్రమే చెప్పేవారు. ఆ తరువాత సినిమాలే చెబుతున్నాయి. 1980 ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితులు ఉండేవి. ఆ కాలంలో జమిందారులు, భూ స్వాములదే వ్యవస్థ నడిచేది. ఇలాంటి సమయంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉండేదో తెలిపి తీసిన మూవీ ‘రంగస్థలం’. మైత్రి మూవీ మూకర్స్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీ ఐదేళ్ల కిందట […]

Written By: Chai Muchhata, Updated On : April 24, 2023 8:57 am
Follow us on

Rangasthalam, aadhi pinisetty

Rangasthalam: కొన్ని విషయాలను సినిమాల ద్వారానే తెలుసుకుంటాం. పురాతన కాలంలో ఈ భూమ్మీద ఏమేం జరిగేవో ఒకప్పుడు తాతలు మాత్రమే చెప్పేవారు. ఆ తరువాత సినిమాలే చెబుతున్నాయి. 1980 ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితులు ఉండేవి. ఆ కాలంలో జమిందారులు, భూ స్వాములదే వ్యవస్థ నడిచేది. ఇలాంటి సమయంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉండేదో తెలిపి తీసిన మూవీ ‘రంగస్థలం’. మైత్రి మూవీ మూకర్స్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీ ఐదేళ్ల కిందట రిలీజై బ్లాక్ బస్టర్ నిలిచింది. ఇందలో మెగాస్టార్ రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకుననాడు. ఆయనకు జోడిగా స్టార్ హీరో సమంత నటించింది.

‘రంగస్థలం’ మూవీలో రామ్ చరణ్ తో పాటు మరో హీరో ఆది పినిశెట్టి నటించాడు. రామ్ కు అన్నగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఈయన మరణంతో కీలక మలుపు తిరుగుతుంది. ఆయితే ఆది పినిశెట్టి ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ తరువాత వీరు విడిపోతారు. అమ్మాయి తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించారు. ఆది పక్కన నటించిన అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారారు. స్టార్ హీరోల పక్కన నటించి ఆకట్టుకున్నారు. లేటేస్టుగా ఆమె అందమైన ఫొటోలు నెట్టింట్లో ఆకట్టుకుంటున్నాయి.

ఆమె పేరు పూజిత పొన్నాడ. ఏపీలోని విశాఖ పట్నంకు చెందిన పూజిత ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత టీసీఎస్ లో ఉద్యోగం సంపాదించారు. ఆ తరువాత సినిమా రంగంపై ఆమెకు ఇష్టం ఏర్పడడంతో ఓ షార్ట్ ఫిలింలో నటించారు. 2015లో వచ్చిన ‘ఉప్మా తినేసింది’ అనే షార్ట్ ఫిలింతో ఆకట్టుకున్న పూజిత ఆ తరువాత 2016 ‘తుంటరి’తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ సినిమాల్లో గుర్తింపు రాలేదు.

aadhi pinisetty

కానీ 2018లో వచ్చిన రంగస్థలంలో ఆమెకు ఆఫర్ రావడంతో ఉత్సాహంగా నటించింది. ఈ సినిమాలో గుర్తింపు క్యారెక్టర్ లేకపోయినా ఆమె అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. ఈ మూవీ తరువాత ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’, ‘ బ్రాండ్ బాబు’, ‘సెవెన్’ అనే చిత్రాల్లో అవకాశం వచ్చింది. ఇటీవల రిలీజైన రవితేజ మూవీ ‘రావణాసుర’లో హీరోయిన్ చేసింది. పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఓ సాంగ్ లో కనిపిస్తుందని తెలుస్తోంది. అయితే ఇంతలో ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన అందమైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి..