https://oktelugu.com/

Kattappa Character: ‘కట్టప్ప’ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

Kattappa Character: సినీ ఇండస్ట్రీలో స్టార్లు మారిన తరువాత కొందరు హీరోలు పొదుపుగా సినిమాల్లో నటిస్తారు. వారి స్టార్ డం కాపాడుకునేందుకు లేదా ఆ తరువాత వచ్చే అవకాశాల కోసం ఆచి తూచి అడుగులు వేస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు కమిట్ కావడంతో మరికొన్నింటిని వదులుకుంటారు. అయితే వద్దనుకున్న సినిమాలో ఒక్కోసారి బ్లాక్ బస్టర్ గా మారుతాయి. అలా వివిచిపెట్టిన సినిమాలు హిట్టు కొట్టడంతో వారు ‘మిస్ చేసుకున్నాం.. ’నే గెల్టీ ఫీలింగ్ ఉంటుంది. లేటేస్టుగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 24, 2023 9:13 am
    Follow us on

    Kattappa Character

    Kattappa Character

    Kattappa Character: సినీ ఇండస్ట్రీలో స్టార్లు మారిన తరువాత కొందరు హీరోలు పొదుపుగా సినిమాల్లో నటిస్తారు. వారి స్టార్ డం కాపాడుకునేందుకు లేదా ఆ తరువాత వచ్చే అవకాశాల కోసం ఆచి తూచి అడుగులు వేస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు కమిట్ కావడంతో మరికొన్నింటిని వదులుకుంటారు. అయితే వద్దనుకున్న సినిమాలో ఒక్కోసారి బ్లాక్ బస్టర్ గా మారుతాయి. అలా వివిచిపెట్టిన సినిమాలు హిట్టు కొట్టడంతో వారు ‘మిస్ చేసుకున్నాం.. ’నే గెల్టీ ఫీలింగ్ ఉంటుంది. లేటేస్టుగా బాహుబలి సినిమాలోని ఓ ప్రముఖ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో మొదట వద్దనుకున్నాడట. కానీ ఆ తరువాత ఆ పాత్రకు గుర్తింపు రావడంతో నాలుక కరచుకున్నాడటు. ఇంతకీ ఎవరా హీరో? ఏంటా పాత్ర?

    టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రిలీజైన బాహుబలి ద్వయం చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా స్టోరీ పరంగానే కాకుండా క్యారెక్టరైజేషన్ అద్భుతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ రాజమౌళి. సాధారణంగానే జక్కన్న తన సినిమాలో ప్రతీ పాత్రకు గుర్తింపు తీసుకొస్తాడు. కానీ బాహుబలిలో హీరో ప్రభాస్, విలన్ రానాలతో సమానంగా మరో పాత్రను హైలెట్ చేశాడు. ఆ పాత్ర పేరే కట్టప్ప. బాహుబలి రెండు సినిమాలు కట్టప్పను ఆధారం చేసుకొనే సాగుతాయి. ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ తప్ప మరెవరూ నటించలేరని అనుకుంటారు.

    Kattappa Character

    Sanjay Dutt

    అయితే ఈ పాత్ర కోసం రాజమౌళి ముందుగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను కలిశాడట. అయితే సంజయ్ దత్ బాలీవుడ్ స్టారో హీరో కాబట్టి ఈ పాత్ర చేయలేనని చెప్పాడట. అంతేకాకుండా ఈ క్యారెక్టర్ కు పెద్దగా గుర్తింపు లేదని చెప్పి రిజెక్ట్ చేశాడట. దీంతో రాజమౌళి వెంటనే సత్యరాజ్ ను కలిసి స్టోరీ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నాడు. దీంతో సత్యరాజ్ కట్టప్పగా నటించి ఆకర్షించాడు. ఒకవిధంగా చెప్పాలంటే సత్యరాజ్ కెరీర్లోనే బాహుబలి సినిమా ది బెస్ట్ మూవీగా నిలిచిందనే చెప్పాలి.

    ఇక సంజయ్ దత్ ఈ సినిమా మిస్ అయిన తరువాత ‘కేజీఎఫ్-చాప్టర్ 2’లో విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. కానీ బాహుబలిలో గనుక కట్టప్ప పాత్ర పోషిస్తే సంజయ్ దత్ ఇంకా హైలెట్ అయ్యేవారని ఇక్కడి ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఒక్కోసారి కొన్ని అదృష్టాలు కొందరికే దక్కుతాయని, అవి రావాల్సిన వారికే వస్తాయని చర్చించుకుంటున్నారు.