
Sir Collections: టాలీవుడ్ టాప్ 3 దర్శకుల లిస్ట్ తీస్తే అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు లేకుండా మాత్రం ఉండదు.డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే రైటర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత డైరెక్టర్ గా మారి ఎన్నో సంచలనాత్మక సినిమాలు తీసాడు.ఇప్పుడు ఆయన నిర్మాతగా కూడా తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు.తన భార్య కోరికమేర ‘ఫార్చ్యూన్ ఫోర్’ అనే సంస్థని ఏర్పాటు చేసాడు.
రీసెంట్ గా ఈ సంస్థ నుండి ధనుష్ హీరో గా నటించిన ‘సార్’ చిత్రం విడుదలై మంచి బ్లాక్ బస్టర్ గా నిల్చింది.ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు ఈ సినిమా అందరి అంచనాలను మించే వసూళ్లను రాబట్టింది.కేవలం థియేటర్స్ నుండే దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగా లాభాలను రాబట్టిన త్రివిక్రమ్ & టీం, లాభాలన్నిటినీ సమానంగా పంచుకున్నారట.వీటితో పాటుగా డిజిటల్ రైట్స్ మరియు సాటిలైట్ రైట్స్ రూపం లో ఈ సినిమాకి మరో 50 కోట్ల రూపాయిలు అదనంగా లభించింది.
ఈ సినిమాకి త్రివిక్రమ్ తో పాటుగా సూర్య దేవర నాగవంశీ కూడా మరో నిర్మాతగా వ్యవహరించాడు.ప్రస్తుతం మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి మెయిన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా సాగుతుంది.అలా మొత్తం మీద ‘సార్’ చిత్రం మొత్తం బిజినెస్ కలిపి త్రివిక్రమ్ వాటా 30 కోట్ల రూపాయిల వరకు ముట్టినట్టు సమాచారం.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సముద్ర ఖని దర్శకత్వం పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమాని నిర్మిస్తున్నాడు.ఈ సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్.అలా త్రివిక్రమ్ కేవలం దర్శకుడిగా మరియు రైటర్ గా మాత్రమే కాదు, చివరికి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు.ఇక రాబొయ్యే రోజుల్లో ఇలాగే సినిమాలను నిమిస్తాడో లేదో చూడాలి.