Akkineni Akhil: అక్కినేని అఖిల్ కాబోయ్యే భార్య ఈమెనే..CCPL మ్యాచ్ లో అడ్డంగా దొరికిపోయారు

  Akkineni Akhil: అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లోకి భారీ అంచనాల నడుమ లాంచ్ అయినా అక్కినేని అఖిల్ కి ఇప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినప్పటికీ ఆయనకీ క్రేజ్ మాత్రం బాగానే ఉంది.ఆయనకీ అలా క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం అతని అందమే.మనం లో సినిమాలో ఆయన ఇచ్చిన ఎంట్రీ కి అందరూ టాలీవుడ్ కి మరో మహేష్ బాబు వచేసాడు అని భారీ హైప్ ఇచ్చారు. కానీ మొదటి సినిమా […]

Written By: Shiva, Updated On : March 7, 2023 5:38 pm
Follow us on

Akhil Akkineni

 

Akkineni Akhil: అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లోకి భారీ అంచనాల నడుమ లాంచ్ అయినా అక్కినేని అఖిల్ కి ఇప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినప్పటికీ ఆయనకీ క్రేజ్ మాత్రం బాగానే ఉంది.ఆయనకీ అలా క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం అతని అందమే.మనం లో సినిమాలో ఆయన ఇచ్చిన ఎంట్రీ కి అందరూ టాలీవుడ్ కి మరో మహేష్ బాబు వచేసాడు అని భారీ హైప్ ఇచ్చారు.

కానీ మొదటి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది, రెండవ సినిమా ‘హలో’ కూడా యావరేజి గా ఆడింది.ఇక మూడవ సినిమా మిస్టర్ మజ్ను మరో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.కానీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా మాత్రం కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది.ఆయన నుండి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఏజెంట్ సినిమాతో వాళ్ళ ఎదురు చూపులకు తెరపడింది ఆశిస్తున్నారు.

Akkineni Akhil

అయితే అక్కినేని అఖిల్ లో నటన కంటే ఎక్కువగా టాలెంట్ ఉన్నది క్రికెట్ లో.ఇతను ఒక భయంకరమైన ఆటగాడు,ఇండియన్ క్రికెట్ టీం కి సెలెక్ట్ అయ్యేందుకు అన్నే అర్హతలు ఉన్న వ్యక్తి.కానీ ఎందుకో క్రికెట్ వైపు కాకుండా సినిమాల వైపు వచ్చాడు.రీసెంట్ గా ఆయన CCPL టోర్నమెంట్ లో ‘తెలుగు వారియర్స్’ తరుపున ఆడుతున్నాడు.మెరుపు షాట్స్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ ని కొనసాగిస్తూ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేలా చేస్తున్నాడు.ఫ్యాన్స్ సంగతి అలా కాసేపు పక్కన పెడితే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రణవి మనుకొండ అక్కినేని అఖిల్ ఇన్నింగ్స్ ఆడుతున్నంత సేపు ఒక రేంజ్ లో చీర్అప్ చేసింది.

ఆమెలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే అఖిల్ లవర్ కంటే ఎక్కువ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది.దానికి సంబంధించిన వీడియోలు చూసిన అక్కినేని ఫ్యాన్స్ మా వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అంటూ ఆమెని సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు.మరి ఈ కామెంట్స్ పై ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.